AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొరకరాని కొయ్యలతో ఉత్తమ్‌కు పరేషాన్..ఎందుకంటే ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల రూటు సెపరేటు. ప్రతిపక్షంలో వుంటూ అధికార పక్షాన్ని పొగడ్తలతో ముంచేస్తుంటారు. ఏమైనా అంటే తమ నియోజకవర్గం అభివృద్ధికేనంటారు. ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుందామంటే అసలే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. దాంతో క్రమశిక్షణ చర్యలకు సాహసించే పరిస్థితి లేనే లేదు. ఇంకేముంది వారు ఛాన్స్ దొరికినపుడల్లా రెచ్చిపోతూనే వుంటారు. ఇంతకీ వారిద్దరు ఎవరనే కదా ? రీడ్ దిస్.. లాస్ట్ ఇయర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దారుణ […]

కొరకరాని కొయ్యలతో ఉత్తమ్‌కు పరేషాన్..ఎందుకంటే ?
Rajesh Sharma
|

Updated on: Nov 02, 2019 | 4:50 PM

Share
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేల రూటు సెపరేటు. ప్రతిపక్షంలో వుంటూ అధికార పక్షాన్ని పొగడ్తలతో ముంచేస్తుంటారు. ఏమైనా అంటే తమ నియోజకవర్గం అభివృద్ధికేనంటారు. ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుందామంటే అసలే పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో వుంది. దాంతో క్రమశిక్షణ చర్యలకు సాహసించే పరిస్థితి లేనే లేదు. ఇంకేముంది వారు ఛాన్స్ దొరికినపుడల్లా రెచ్చిపోతూనే వుంటారు. ఇంతకీ వారిద్దరు ఎవరనే కదా ? రీడ్ దిస్..
లాస్ట్ ఇయర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా దారుణ ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి గెలిచిందే 19 సీట్లు.. అందులోను ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ గూటికి అందరూ చేరిపోగా.. ఇక కాంగ్రెస్ పక్షాన మిగిలింది కేవలం ఆరుగురు. వీరిలో ఉత్తమ్ కుమార్ ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక మిగిలింది భట్టి విక్రమార్క (మధిర) శ్రీధర్‌బాబు (మంథని) సీతక్క (ములుగు) రాజ్‌గోపాల్ రెడ్డి (మునుగోడు) జగ్గారెడ్డి (సంగారెడ్డి) పోడెం వీరయ్య (భ్రదాచలం).
వీరిలో ఆ ఇద్దరు అంటే.. జగ్గారెడ్డి, రాజ్‌గోపాల్ రెడ్డిల తీరే సెపరేటు. తరచూ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రిని పొగడడం సొంత పార్టీని అయోమయంలో ముంచేయడం వీరిద్దరికీ పరిపాటిగా మారడం తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందికరంగా మారింది. టిఆర్ఎస్ అధినేత కెసీఆర్‌తో ఒకప్పుడు అమీతుమీ అనే లెవల్‌లో మాట్లాడిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెండు, మూడు నెలలుగా వైఖరి మార్చారు. చిరకాలంగా వ్యతిరేకిస్తున్న హరీశ్ రావుతోను జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తరచూ ప్రభుత్వాన్ని పొగుడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసమే అంటూ వస్తున్న జగ్గారెడ్డి.. పార్టీ మారతారా అంటే మాత్రం సూటిగా తేల్చరు. ఒక్క ఆర్టీసీ అంశం మినహాయిస్తే కెసీఆర్ ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి పలు అంశాలపై ఆకాశానికెత్తేశారు.
ఇక రాజ్‌గోపాల్ రెడ్డి కూడా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారీమధ్యే. ఈసారి ఆయన పొగిడింద రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి కెటీఆర్‌ను. ఇండస్ట్రియల్ పార్క్‌కోసం తక్కువ ధరలకే భూములిచ్చేలా రైతులను ఒప్పించిన కెటీఆర్ లాంటి డైనమిక్ లీడర్ వుండడం తెలంగాణ అదృష్టమని ఆయనన్నారు. సో.. ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీకి మిగిలిందే ఆరుగురు ఎమ్మెల్యేలు. అందులో ఇద్దరు తరచూ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి ఎంబర్రాస్‌మెంట్ కాక ఇంకేముంది ?