AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దపప్పు మీరు కాక ఇంకెవరు..? జగన్‌పై టీడీపీ నేత సెటైర్

ఏపీ పొలిటికల్ వార్.. ట్విట్టర్ వేదికగా కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలపై కాకుండా.. సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే సీఎం జగన్ […]

ముద్దపప్పు మీరు కాక ఇంకెవరు..? జగన్‌పై టీడీపీ నేత సెటైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 02, 2019 | 4:17 PM

Share

ఏపీ పొలిటికల్ వార్.. ట్విట్టర్ వేదికగా కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలపై కాకుండా.. సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే సీఎం జగన్ చేసిన ప్రసంగం అంతా తప్పులతడకగా ఉందంటూ.. టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. పేపర్లో చూసుకుంటూ కూడా సీఎం జగన్ సరిగా చదవలేకపోయారంటూ బుద్దా వెంకన్న ట్విటర్ వేదికగా విమర్శలుగుప్పించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన ట్వీట్‌లో జతచేశారు. చూడకుండా ప్రసంగాలు చేసేవాళ్లు తప్పు మాట్లాడితే వారిని పప్పు అంటున్నారని.. మరి అలాంటప్పుడు చూసి కూడా తప్పులు చదివేవారిని ముద్ద పప్పు అని పిలవాలంటూ ఎద్దేవా చేశారు.

Follow Us