AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నాటకలో ‘ ఆపరేషన్ లోటస్ ‘.. చిక్కుల్లో యడియూరప్ప..?

కర్నాటకలో ఇదో సరికొత్త రాజకీయ పరిణామం.. ఈ ఏడాది ఆరంభంలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారట. ఇలా అని సాక్షాత్తూ బీజేపీ సీఎం యడియూరప్ప తమ పార్టీ కార్యకర్తలతో చేసిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ఒకటి లీకయింది. ఈ మధ్యే తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న ఆయన ప్రభుత్వానికి ఇది […]

కర్నాటకలో ' ఆపరేషన్ లోటస్ '.. చిక్కుల్లో యడియూరప్ప..?
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Nov 02, 2019 | 5:52 PM

Share

కర్నాటకలో ఇదో సరికొత్త రాజకీయ పరిణామం.. ఈ ఏడాది ఆరంభంలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమైన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారట. ఇలా అని సాక్షాత్తూ బీజేపీ సీఎం యడియూరప్ప తమ పార్టీ కార్యకర్తలతో చేసిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ఒకటి లీకయింది. ఈ మధ్యే తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న ఆయన ప్రభుత్వానికి ఇది ‘ ఇబ్బంది ‘ కలిగించే అంశమే.. ఈ క్లిప్ కి మీ స్పందన ఏమిటన్న ప్రశ్నకు ఆయన తన సమాధానాన్ని దాట వేశారు. ఇందులోని నిజానిజాలను తానేమీ సవాలు చేయడంలేదని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే మాట్లాడానని అన్నారు. తమ శాసన సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన 17 మంది కాంగ్రెస్-జేడీ-ఎస్ సభ్యుల కన్నా మీరు మరింత మెరుగ్గా పని చేయాలని యెడ్యూరప్ప తమ పార్టీ కార్త్యకర్తలకు ఉద్బోధించారట. (ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేల కారణంగా ఈ ఏడాది జులైలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయింది).

ముంబైలో ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేల ప్లాన్ గురించి అమిత్ షాకు తెలుసునని, పార్టీ విప్ జారీ చేసినప్పటికీ వారు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో సభకు గైర్ హాజరవుతారన్న విషయం కూడా షాకు తెలుసునని ఎడ్డీ పేర్కొన్నారు. అసలు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను షా పర్యవేక్షించారని ఆయన అన్నారు. ముంబైలో వారు రెండు మూడు నెలలు ఉన్నారు.. తమ నియోజకవర్గాలకు వెళ్లలేకపోయారు.. అలాగే తమ కుటుంబాలను కూడా కలుసుకోలేకపోయారు.. ఇదంతా మీకు తెలుసా ? లేదా ? అని ఆయన బీజేపీ కార్యకర్తలను ప్రశ్నించారు. అసాధారణంగా ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మనకు సహకరించారని, లేకుంటే మిగతా కాలానికి వారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్ఛేదని యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనతో వారున్నారని అన్నారు. వాళ్ళు తమ పదవులకు రాజీనామాలు చేశారు.. సుప్రీంకోర్టుకెక్కారు.. ఇదంతా తెలిసి కూడా మనం వారి వెంట ఉన్నాం.. అన్నారాయన. అసలు మరోసారి సీఎం అయ్యే అవసరమే తనకు లేదని, తాను మూడు నాలుగు సార్లు ఈ పదవిలో ఉన్నానని, కానీ పార్టీ అధిష్టానం మళ్ళీ నన్ను సీఎం చేయడంతో నేరం చేసినవాడిలా ఫీలవుతున్నానని యడియూరప్ప అన్నారట. ఇక ఈ ఆడియో టేపు లీక్ కావడంతో మాజీ సీఎం కుమారస్వామి, కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ స్పందిస్తూ.. ఇప్పటికైనా బీజేపీ బండారం బయటపడిన విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్