AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Macherla EVM Destruction Case: కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లొద్దు.. పిన్నెల్లికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు..

సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. పోలింగ్‌ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా.. పిన్నెల్లిని అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది..

Macherla EVM Destruction Case: కౌంటింగ్ పరిసరాల్లోకి కూడా వెళ్లొద్దు.. పిన్నెల్లికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. కీలక ఆదేశాలు..
Pinnelli Ramakrishna Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 03, 2024 | 1:30 PM

Share

సుప్రీంకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. పోలింగ్‌ రోజున మే 13 మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అంతేకాకుండా.. పిన్నెల్లిని అరెస్ట్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.. హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన టీడీపీ ఏజెంట్.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.. ఈ కేసును విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. కౌంటింగ్ రోజున సెంటర్‌కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశిచ్చింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణపై స్టే ఇవ్వకపోతే న్యాయవ్యవస్థను హేళన చేసినట్టేనని బెంచ్ పేర్కొంది.

కాగా.. విచారణ సందర్భంగా ఈవీఎం ధ్వంసం వీడియోను పిటిషనర్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తుల ఎదుట ప్రదర్శించారు. అయితే.. ఆ వీడియోలో ఉన్నది ఎవరో తెలియదు. ఇది అధికారిక వీడియో కాదు అంటూ పిన్నెల్లి తరఫున న్యాయవాది వికాస్ సింగ్ వాదించారు.

అక్కడ ఫొటోలు కూడా ఉన్నాయి అంటూ పేర్కొన్న బెంచ్.. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాలకు కూడా పిన్నెల్లి వెళ్లకూడదని సుప్రీం ఆదేశించింది. పిన్నెల్లిని 6వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. పిన్నెల్లికి ముందస్తు ఉపశపనం కల్పించి హైకోర్టు తప్పు చేసిందని అభిప్రాయపడింది. ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

జూన్ 6న లిస్టయిన ఈ పెండింగ్ కేసుపై హైకోర్టు పిటిషన్‌ను త్వరగా విచారణ ముగించాలని పేర్కొంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల అంశంతో ప్రభావితం కాకుండా కేసులోని మెరిట్స్ ప్రకారం విచారణ జరపాలని బెంచ్ సూచించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..