Watch Video: బుర్రుపిట్టలకు చుక్కలు చూపించిన రైతులు.. వినూత్న ఆలోచనతో పంటకు రక్షణ..
రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాలి. పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకూ రేయింబవళ్లు కంటికి రెప్పలా సంరక్షించాలి. వేలకు వేలు పోసి రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఒక వైపు అతివృష్టి, అనావృష్టి, చీడ పీడలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంటే.. మరోవైపు ఆ పంటపై జంతువులు, పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలి పోటులా మారాయి.
రైతు వ్యవసాయం చేయాలంటే ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కోవాలి. పొలంలో విత్తు విత్తింది మొదలు పంట దిగుబడి చేతికొచ్చే వరకూ రేయింబవళ్లు కంటికి రెప్పలా సంరక్షించాలి. వేలకు వేలు పోసి రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఒక వైపు అతివృష్టి, అనావృష్టి, చీడ పీడలు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంటే.. మరోవైపు ఆ పంటపై జంతువులు, పక్షుల బెడద గోరు చుట్టుపై రోకలి పోటులా మారాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ఎవరికి తోచిన విధంగా వారు పంట సంరక్షణ కోసం పలు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. కొందరు కోతుల బెడదతో శబ్దాలు వినిపించెలా మైకులు ఏర్పాటు చేస్తే ఇంకొందరు పక్షుల బెడద లేకుండా పాలిథిన్ కవర్లు పంటపై ఉంచి కాపాడుకుంటున్నారు.
పంటల సాగుకు వాతావరణంతో పాటు జంతువులు, పక్షుల బెడద తప్పడం లేదు. వాతావరణం అనుకులించి పంటలు సాగు చేసినా రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలను జంతువులు, పశువులు, పక్షుల నుంచి కాపాడుకునేందుకు అనేక రకాలుగా పాట్లు పడుతున్నారు. వినూత్నంగా ఆలోచిస్తూ పంట చేనుల్లో కొత్త పరికరాలను, కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ పక్షులు, జంతువులు అటువైపు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రైతులు జొన్న పంట కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.
వీరిలో కొందరు జొన్న పంటలను సాగుచేస్తున్నారు. అయితే ఉదయం, సాయంత్రం సమయంలో పక్షులు, కోతులు, ఇతర జీవులు పంట చేనులపై పడి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలను కాపాడుకోవాలనే లక్ష్యంతో రైతులు జొన్న కంకుల వద్ద పాలిథిన్ కవర్లు ఉంచుతున్నారు. ఈ కవర్లు ఏర్పాటు చేయడం వల్ల గాలి శబ్దానికి కవర్లు ఊగుతున్నాయి. దీని వల్ల పక్షులు పంటను నాశనం చేసే అవకాశం ఉండదని వీరి ఆలోచన. ఆ ఆలోచన అమలు చేసాక పక్షులు జొన్న పంట వైపు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇందుకోసం పెద్ద ఖర్చు లేకపోవడం, పాలిథిన్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ విరివిగా లభించే అవకాశం ఉందటంతో రైతులు ఈ పద్ధతిలో పంటను పక్షుల నుంచి కాపాడుకొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..