AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nalgonda: మళ్లీ అదే దారుణం! వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా అదే నీళ్లు తాగుతున్న జనం

నాగార్జునసాగర్‌ ఘటన మరువక ముందే నల్గొండ జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం తేలింది. వాటర్‌ ట్యాంక్‌లో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్‌ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకులో నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న..

Nalgonda: మళ్లీ అదే దారుణం! వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా అదే నీళ్లు తాగుతున్న జనం
Dead Body Found In Water Tank
Srilakshmi C
|

Updated on: Jun 03, 2024 | 3:47 PM

Share

నల్గొండ, జూన్‌ 3: నాగార్జునసాగర్‌ ఘటన మరువక ముందే నల్గొండ జిల్లాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం తేలింది. వాటర్‌ ట్యాంక్‌లో అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్‌ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకులో నీళ్లు చెక్‌ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి, ట్యాంకును శుభ్రం చేయించారు. తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

వాటర్‌ ట్యాంక్‌లో కనిపించిన శవం హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత పది రోజుల నుంచి కనిపించకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అయితే అతడు తనకు తానుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నా డా? లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా? లేదంటే మరెవరైనా హత్య చేసి శవాన్ని అందులో పడేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మరోవైపు అది మంచినీళ్ల ట్యాంక్‌ కావడంతో గత పది రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా అవే నీళ్లు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా గత కొద్ది రోజుల క్రితం నాగార్జునసాగర్‌లో ఇదే రీతిలో మరో దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దాహం తీర్చుకోవడానికి ఒకదాని వెంట మరొకటి మినీ వాటర్‌ ట్యాంకులోకి దిగిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయం తెలియక అక్కడి ప్రజలు కలుషిత నీటినే సేవించారు. ఈ నేపథ్యంలో తాజాగా నల్గొండలోనూ మంచినీళ్ల ట్యాంకులో శవం తేలడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కలుషితాన్ని అరికట్టేందుకు, నీటి సరఫరాకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.