TG Rain Alert: కూల్‌ న్యూస్‌.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు! నేటి నుంచి వానలు దంచుడే..

దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మే 30న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిన్న కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమలోకి ఎంటర్‌ అయ్యాయి. ఇవాళ తెలంగాణను తాకాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో..

TG Rain Alert: కూల్‌ న్యూస్‌.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు! నేటి నుంచి వానలు దంచుడే..
Southwest Monsoon
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 03, 2024 | 3:17 PM

హైదరాబాద్‌, జూన్‌ 3: దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మే 30న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిన్న కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమలోకి ఎంటర్‌ అయ్యాయి. ఇవాళ తెలంగాణను తాకాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు చరుగ్గా కదులుతున్నాయి.

సాధారణంగా జూన్‌ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. కానీ ఈ సారి వారం ముందుగానే రాష్ట్రంలోకి ఆగమనం జరిగింది. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్లు సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మంగళవారం నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌ నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఆదివారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.