Telangana Polycet: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణలో పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌. తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫలితాలు వచ్చేశాయి. డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే24వ తేదీన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే...

Telangana Polycet: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి
TS Polycet Results
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 03, 2024 | 12:31 PM

తెలంగాణలో పాలిసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్‌. తెలంగాణ పాలిసెట్‌ 2024 ఫలితాలు వచ్చేశాయి. డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే24వ తేదీన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* ఇందుకోసం విద్యార్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే ర్యాంక్‌ కార్డ్‌పై క్లిక్‌ చేయాలి.

* అక్కడ హాల్‌ టికెట్ నెంబర్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే ర్యాంక్‌ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..