Learning: ఇంగ్లిష్‌లో ఇరగదీయాలని ఉందా.? ఈ 5 టిప్స్‌ పాటించండి..

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇంగ్లిష్‌ భాష ప్రాచుర్యంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌ కామన్‌ లాంగ్వెజ్‌గా అవతరించింది. దీంతో ఈ భాషపై అవగాహన పెంచుకోవడం అనివార్యంగా మారింది. కేవలం ఐటీ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో పనిచేయాలంటే ఇంగ్లిష్‌ భాష వచ్చి ఉండాల్సిందే. అంతలా ఈ భాష ప్రాముఖ్యత సంతరించుకుంది...

Learning: ఇంగ్లిష్‌లో ఇరగదీయాలని ఉందా.? ఈ 5 టిప్స్‌ పాటించండి..
English Speaking Skills
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 02, 2024 | 6:51 PM

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇంగ్లిష్‌ భాష ప్రాచుర్యంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌ కామన్‌ లాంగ్వెజ్‌గా అవతరించింది. దీంతో ఈ భాషపై అవగాహన పెంచుకోవడం అనివార్యంగా మారింది. కేవలం ఐటీ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో పనిచేయాలంటే ఇంగ్లిష్‌ భాష వచ్చి ఉండాల్సిందే.

అంతలా ఈ భాష ప్రాముఖ్యత సంతరించుకుంది. దీంతో ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నో ఇంగ్లిష్‌ కోచింగ్ సెంటర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇంగ్లిష్‌ భాషను పర్‌ఫెక్ట్‌గా నేర్చుకోవాలంటే కొన్ని టిప్స్‌ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంగ్లిష్‌ ప్రాక్టీస్‌ చేస్తేనే వస్తుంది. అందుకే ప్రతీరోజూ ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలి. మాట్లాడ్డానికి ఎవరూ లేకపోతే అద్దంలో మీతో మీరైనా మాట్లాడుకోవాలి. అలాగే సబ్‌ టైటిల్స్‌తో వచ్చే సినిమాలను పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా వకాబులరీ పెంచుకోవడం కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్‌ చదువుతూ తెలియని పదాల అర్థాలను డిక్షనరీలో చూసి నేర్చుకుంటే ఇంగ్లిష్‌ చాలా సులభంగా నేర్చుకోవచ్చు.

* ఇంగ్లిష్‌ భాషలో ప్రావీణ్యం రావాలంటే గ్రూప్‌ డిస్కర్షన్స్‌లో పాల్గొనాలి. ఇలాంటి మీటింగ్స్‌ ప్రస్తుతం ఆన్‌లైన్‌లోనే కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో పాల్గొంటూ ఇంగ్లిష్‌ స్కిల్స్‌ పెంచుకోవచ్చు.

* ప్రతీ రోజూ కొన్ని కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. ఇందుకోసం డిక్షనరీలో వెతుక్కోవాలి. రోజూ కనీసం రెండు కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. ఇలా ప్రాక్టీస్‌ చేయడం ద్వారా వకాబులరీ పెరుగుతుంది.

* ఇంగ్లిష్‌ మాట్లాడడం రావాలంటే ముందుగా వినడం కూడా నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా వినాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ సినిమాలు, టీవీ షోలు, టాక్‌ షోలను చూడాలి. ఇలా చూడడం వల్ల ఇంగ్లిష్‌లో ప్రావీణ్యత పొందుతారు.

* ఇక పదాలను ఎలా పలకాలి అన్న విషయంపై కూడా స్పష్టత ఉండాలి. ఇంగ్లిష్‌ పదాల ప్రనౌన్సేషన్‌ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పలు రకాల మొబైల్ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సులభంగా ఇంగ్లిష్‌ నేర్చుకోవచ్చు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..