AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGRTC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీ..

హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హాజరై.. జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలో ప్రాణాల‌ర్పించిన అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు....

TGRTC: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీ..
Tgrtc Jobs
Narender Vaitla
|

Updated on: Jun 02, 2024 | 4:03 PM

Share

నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ శుభవార్త తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో ఉన్న 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అవతరన వేడుకల్లో భాగంగా పాల్గొన్న సజ్జనర్ ఈ విషయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని ఆయన అన్నారు. ‘బస్ కా పయ్యా నహీ ఛలేగా’ నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

హైద‌రాబాద్ లోని బ‌స్ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దశాబ్ది వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ హాజరై.. జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. తెలంగాణ ఉద్య‌మంలో ప్రాణాల‌ర్పించిన అమ‌రుల‌కు నివాళుల‌ర్పించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ భ‌ద్ర‌తా సిబ్బంది నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈ సందర్భంగా స‌జ్జ‌న‌ర్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మ‌లి దశ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున అమరులకు ఘన నివాళులర్పిస్తున్నామని అన్నారు. “ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజులపాటు ‘మేము సైతం’ అంటూ సకల జనుల సమ్మెను కొనసాగించారు. దేశ చరిత్రలో జరిగిన అతి పెద్ద సమ్మెల్లో సకల జనుల సమ్మె ఒకటిగా నిలిచింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని స్వరాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచిపోయింది.” అని అన్నారు.

మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన 48 గంటల్లోనే అమలు చేశామని, ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్పూర్తితో పని చేస్తుండటం వల్లే మహాలక్ష్మి విజయవంతంగా అమలవుతోందన్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే.. ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు 7 ఏళ్లకుపైగా పెండింగ్ లో ఉన్న 2017 వేతన సవరణను చేసి.. ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ను సంస్థ ప్రకటించిందన్నారు. పెండింగ్ లో ఉన్న 9 డీఏలను మంజూరు చేశామని చెప్పారు.

గత రెండేళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్