జగన్‌పై సొంత పార్టీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు కోపం?

జగన్‌పై సొంత పార్టీ పారిశ్రామికవేత్తలకు ఎందుకు కోపం?

పార్టీలో ఎంత అసంతృప్తి వచ్చినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన అనుయాయులు, గతంలో పార్టీ కోసం కష్టపడ్డవారు ఎక్కడున్నా పిలిచి పదవులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ సీఎం, తన తండ్రి రాజశేఖర రెడ్డి బాటలో వెళ్తున్నారన్నది పూర్తి వాస్తవం. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది. గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు ఆయా జిల్లాల్లో భారీగానే ఖర్చుపెట్టారు. వారు […]

Ram Naramaneni

|

Sep 22, 2019 | 2:55 PM

పార్టీలో ఎంత అసంతృప్తి వచ్చినా లెక్క చేయకుండా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన అనుయాయులు, గతంలో పార్టీ కోసం కష్టపడ్డవారు ఎక్కడున్నా పిలిచి పదవులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఆయన మాజీ సీఎం, తన తండ్రి రాజశేఖర రెడ్డి బాటలో వెళ్తున్నారన్నది పూర్తి వాస్తవం. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది.

గతంలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కొంతమంది వ్యాపారవేత్తలు ఆయా జిల్లాల్లో భారీగానే ఖర్చుపెట్టారు. వారు జగన్ సీఎం అయ్యాక తమకు కాస్త ఉపయోగపడతాడని, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యతనిస్తాడని ఆశించారు. అయితే ఆ దిశగా ఆయన అడుగులు పడకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు.  ఇప్పటికే 24 మందిని టీటీడీ బోర్డులో నియమించగా అందులో కేవలం 8 మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్ వారున్నారని కొందరు చర్చించుకుంటున్నారు.

ఆ అసంతృప్తి అలాగే ఉండగా జగన్ పార్టీ నేతలకు మరో షాకిచ్చారు. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక అతిథులుగా మరో ఏడుగురికి చాన్సిచ్చారు. అందులో ఒక్కరు మినహా మిగతా వారంతా ఇతర రాష్ట్రాలవారే కావడంతో కొందరు పారిశ్రామికవేత్తలు, నాయకులు మనసులోనే మండిపోతున్నారు. పైగా తాజా నియామకాల్లో చెన్నైకి చెందిన శేఖరరెడ్డి ఉండడం రచ్చకు దారితీస్తోంది. శేఖరరెడ్డి చంద్రబాబు హయాంలోనూ టీటీడీ సభ్యుడిగా ఉన్నారు.. ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరగడంతో ఆయన సభ్యత్వం  కోల్పోయారు. అలాంటి వివాదాస్పదుడికి జగన్ ఇప్పుడు ప్రత్యేక అతిథిగా టీటీడీలోకి తెచ్చారు.

గతంలో పాలకమండలిలో 16 మంది సభ్యులు ఉండగా ఈ సంఖ్యను ప్రభుత్వం ఇటీవల 25మందికి పెంచిన సంగతి తెలిసిందే. వీరితో పాటు దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, టీటీడీ ఈవో, దేవదాయ శాఖ కమిషనర్‌, తుడా చైర్మన్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఇక వీరికి తోడు ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి కూడా అవకాశం కల్పించింది.

ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, రాకేష్ సిన్హా (ఢిల్లీ), శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవిందహరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)లను నియమించింది. వీరికి కూడా పాలకమండలి సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉండనుండగా పాలకమండలి నిర్ణయాలలో మాత్రం ఓటుహక్కు ఉండదు. తాజాగా నియమించిన ఏడుగురిలో భూమన ఒక్కరే ఏపీకి చెందినవారు. గోవింద హరి తెలంగాణవాసి.. మిగతావారంతా ఇతర రాష్ట్రాలవారే.

అయితే జగన్ సీఎం అయ్యి 6 నెలలు కూడా తిరక్కుండానే..వారు అసంతృప్తి చెందడం సరికాదని పార్టీ అగ్రనాయకత్వం చెబుతుంది. ఫ్యూచర్ బర్తీ చేయాల్సిన నామిటేడ్ పదవులు చాలా ఉన్నాయని ఖంగారుపడొద్దని చెప్తున్నారు. ఇక 150 మంది ఎమ్మెల్యేలు గెలవడం, చాలామందికి జగన్ సీఎం కాకముందే హామిలిచ్చి ఉండటంతో కొంతమేర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కానీ జగన్ కాస్త తెలివిగానే అడుగులు వేస్తూ మొగ్గ దశలనే దాన్ని తుంచేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu