ఈ అమ్మకు లక్కు చిక్కేనా ? ఈసారైనా టికెట్ దక్కేనా ?

ఈ అమ్మకు లక్కు చిక్కేనా ? ఈసారైనా టికెట్ దక్కేనా ?

శంకరమ్మ.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిలువెల్లా తగలబడి ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచారి పేరే. శ్రీకాంతా చారి కలలుగన్న తెలంగాణ వచ్చేసింది.. కానీ శ్రీకాంతా చారి మన మధ్య లేడు. అయితేనేం శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ మాత్రం ప్రతీ ఎన్నికలప్పుడు తెర పైకి వస్తూనే ఉంది. మొదట్లో కెసిఆర్ తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తానన్నాడని.. ఆ తర్వాత కెసిఆర్ టికెట్ నిరాకరించాడని గగ్గోలు పెట్టిన విషయం ఇంకా […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Sep 21, 2019 | 7:37 PM

శంకరమ్మ.. ఈ పేరు వింటే మనకు టక్కున గుర్తొచ్చేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిలువెల్లా తగలబడి ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచారి పేరే. శ్రీకాంతా చారి కలలుగన్న తెలంగాణ వచ్చేసింది.. కానీ శ్రీకాంతా చారి మన మధ్య లేడు. అయితేనేం శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ మాత్రం ప్రతీ ఎన్నికలప్పుడు తెర పైకి వస్తూనే ఉంది. మొదట్లో కెసిఆర్ తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తానన్నాడని.. ఆ తర్వాత కెసిఆర్ టికెట్ నిరాకరించాడని గగ్గోలు పెట్టిన విషయం ఇంకా ఎవరమూ మరువలేదు.

కెసిఆర్ మాట తప్పదంటూ మీడియా వేదికగా శంకరమ్మ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొడుకును కోల్పోయిన బాధ కంటే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే బాధే శంకరమ్మలో ఎక్కువ కనిపిస్తుందన్న నెగెటివ్ కామెంట్స్ కూడా బాగానే వినిపించాయి. అయితే ఏ బాధ ఎంత ఎక్కువ అనేది ఇక్కడ చర్చినీచలేం.. కన్న తల్లి బాధనిక్కడ తక్కువ చేసి చూపలేం.. కానీ శంకరమ్మ రాజకీయ కదలికలు మాత్రం చర్చనీయాంశమే. తొలుత తెలంగాణ రాష్ట్ర సమితి.. అక్కడ టికెట్ రాకపోవడం తో కాంగ్రెస్ పార్టీ.. అక్కడా అంతంత మాత్రపు గుర్తింపు దొరకడంతో చివరికి కమలం పార్టీ… ఇలా ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న శంకరమ్మకు ఇపుడు కమలం పార్టీ టికెట్ ఇస్తుందా ? లేక హస్తం పార్టీ లాగే హ్యాండిస్తోందా ? ఇదే ఇపుడు హాట్ టాపిక్. నిజానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు కానీ.. మోడీ మేనియానో లేక ఇంకేదైనా కారణమో.. హుజూర్ నగర్లో బీజేపీ టికెట్ ఆశించే నేతల సంఖ్య మాత్రం పెద్దగానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భాగ్యరెడ్డి, స్థానిక వైద్యుడు కోటా రామారావు, మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి .. ఆ తర్వాత శంకరమ్మ పేర్లు బీజేపీ ఆశావహుల జాబితాలో కనిపిస్తున్నాయి. మరి కమలం పార్టీ అయినా మొదటి ముగ్గురిని పక్కన పెట్టి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందన్న నమ్మకంతో శంకరమ్మకు టికెట్ ఇస్తారా ? లేక హస్తం పార్టీ లాగానో.. కెసిఆర్ లాగానో హ్యాండ్ ఇస్తారా ? వేచి చూడాల్సిందే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu