బిగ్ బ్రేకింగ్ : అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో పెచ్చులూడి మహిళ మృతి
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రెైల్ స్టేషన్లు ప్రాణాంతంకంగా మారాయి. హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద నిలుచున్న ఓ మహిళపై స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడి పడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం సిటీలో భారీ వర్షం కురుస్తున్నందున అమీర్‌పేట వైపు వెళ్తున్న మౌనిక మెట్రో స్టేషన్ కింద నిలబడింది. అయితే ఊహించని రీతిలో పైనుంచి పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. […]
ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హైదరాబాద్ మెట్రో రెైల్ స్టేషన్లు ప్రాణాంతంకంగా మారాయి. హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద నిలుచున్న ఓ మహిళపై స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడి పడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం సాయంత్రం సిటీలో భారీ వర్షం కురుస్తున్నందున అమీర్‌పేట వైపు వెళ్తున్న మౌనిక మెట్రో స్టేషన్ కింద నిలబడింది. అయితే ఊహించని రీతిలో పైనుంచి పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమెకు తలకు తీవ్ర గాయాలైనట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో మెట్రోస్టేషన్ నిర్మాణంలో అలసత్వం బయటపడినట్టయ్యింది. దీనిపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.