సింగరేణిపై బీజేపీ కన్ను .. ఓట్లకోసమేనా ?

సింగరేణి కాలరీస్ ఉద్యోగులపై బీజేపీ ‘ కన్నేసింది ‘. సింగరేణి గనుల్లో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు, వర్కర్లు ఉన్నారు. తెలంగాణాలో ఆరు జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి. కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాల్లో సింగరేణి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలని, టీఆరెస్ ప్రభుత్వం ఇఛ్చిన హామీల్లో ఏవి అమలు […]

సింగరేణిపై బీజేపీ కన్ను .. ఓట్లకోసమేనా ?
Follow us

|

Updated on: Sep 23, 2019 | 5:16 PM

సింగరేణి కాలరీస్ ఉద్యోగులపై బీజేపీ ‘ కన్నేసింది ‘. సింగరేణి గనుల్లో దాదాపు 50 వేల మంది ఉద్యోగులు, వర్కర్లు ఉన్నారు. తెలంగాణాలో ఆరు జిల్లాల్లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ గనులు విస్తరించి ఉన్నాయి. కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాల్లో సింగరేణి సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలని, టీఆరెస్ ప్రభుత్వం ఇఛ్చిన హామీల్లో ఏవి అమలు కాలేదో లిస్ట్ అవుట్ చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానం స్థానిక బీజేపీ నేతలను ఆదేశించినట్టు సమాచారం. ఈ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ , ఇతర తెరాస నాయకులు ఇఛ్చిన హామీల్లో చాలావరకు నెరవేరలేదని రాష్ట్ర బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అందువల్లే మెజారిటీ ఉద్యోగులు ఈ ప్రభుత్వంపట్ల అసంతృప్తితో ఉన్నారని కమలం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ రామచందర్ రావు తెలిపారు. ఈ కార్మికులకు భద్రత లేదని, కనీసం ప్రాథమిక హెల్త్ కేర్ గానీ, వారికి ఇళ్ల రుణాల సౌకర్యం గానీ లేవని ఆయన చెప్పారు. తమ పార్టీ నాయకులు త్వరలో సింగరేణి గనులున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఇంటింటి ప్రచారం చేపడతారని ఆయన పేర్కొన్నారు. అయితే సింగరేణి సిబ్బందికి కేసీఆర్ ప్రభుత్వం తాజాగా.. దసరా కానుకగా దాదాపు లక్షన్నర బోనస్, లాభాల్లో 28 శాతం వాటా ప్రకటించిన నేపథ్యంలో కమలనాథుల యోచన వర్కవుట్ అవుతుందా అన్నది చూడాలి. కేవలం ఓట్లకోసమే బీజేపీ ఇప్పుడు వీరి ‘ సంక్షేమం ‘ పట్ల మొసలి కన్నీరు కారుస్తోందా అన్న అభిప్రాయాలూ వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో పోటీ టీఆరెస్ వర్సెస్, బీజేపీగా కొనసాగిన విషయం తెలిసిందే. సింగరేణి సిబ్బందిలో అనేకమంది గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ముఖ్యంగా పెద్దపల్లిలో చాలామంది టీ ఆర్ఎస్ ను కాదన్నారు. దీంతో ఈ పరిణామం రాజకీయంగా తమకు లాభించ వచ్చునని బీజేపీ ఆశిస్తోంది. ప్రస్తుత యూనియన్ల పదవీ కాలం అక్టోబరు 1 తో ముగుస్తోంది. ఆ మధ్య పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ.. ఇద్దరూ తెరాసకు అనుబంధంగా ఉన్న టీబీజీకె ఎస్ కు చెందిన నాయకులతో టచ్ లో ఉంటూ వచ్చారు. బీజేపీలో చేరిన వీరు.. తమ పార్టీలో చేరాల్సిందిగా వారిని బుజ్జగించారు. కాగా.. గతంలో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు 2012 లోను, ఆ తరువాత 2017 లోను జరిగాయి. అయితే సెంట్రల్ లేబర్ కమిషన్ యూనియన్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు తగ్గించింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..