నిద్రలేమి ప్రాణాంతకం !

నిద్రలేమి ప్రాణాంతకం !

ప్రతిప్రాణికి నిద్ర అత్యంత ప్రాధాన్యం. కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ, ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారిపోయింది. లక్షల మంది సరైన నిద్రపట్టక బాధపడుతున్నట్లుగా మన హైదరాబాద్‌ మనస్తత్వశాస్త్రతవేత్తలు తేల్చారు. నిద్రలేమి అనేది ముఖ్యంగా నగరంలోని ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా వారు స్పష్టం చేశారు. నిద్రలేమి చివరకు ప్రాణాంతకంగా మారుతుందని వారు హెచ్చరించారు. 2013లో 1620 మందిపై నిర్వహించిన అధ్యయనంలో […]

Pardhasaradhi Peri

|

Sep 21, 2019 | 5:44 PM

ప్రతిప్రాణికి నిద్ర అత్యంత ప్రాధాన్యం. కంటినిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. కానీ, ఈ రోజుల్లో నిద్రలేమి పెద్ద సమస్యగా మారిపోయింది. లక్షల మంది సరైన నిద్రపట్టక బాధపడుతున్నట్లుగా మన హైదరాబాద్‌ మనస్తత్వశాస్త్రతవేత్తలు తేల్చారు. నిద్రలేమి అనేది ముఖ్యంగా నగరంలోని ప్రతి 10 మందిలో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా వారు స్పష్టం చేశారు. నిద్రలేమి చివరకు ప్రాణాంతకంగా మారుతుందని వారు హెచ్చరించారు. 2013లో 1620 మందిపై నిర్వహించిన అధ్యయనంలో నిద్రలేమి వల్ల కలిగే అనేక రుగ్మతలను కనుగొన్నారు. ఆ అధ్యయనం ప్రకారం సరైన సరైన నిద్రలేకపోవడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సమస్యలు, గుండె నొప్పి, స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నిద్రలేమి ఫలితంగా గుండేనొప్పి సమస్యతో చాలామంది చనిపోతారు. నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువగా ఆందోళన, వ్యాకులత బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. సమస్యను పరిష్కరించుకునే శక్తిపై, అప్రమత్తత, చురుకుదనం సామర్ధ్యాలపై ప్రభావం చూపిస్తుంది. మీరు తగినంత నిద్ర పోకపోతే, మీ జ్ఞాపకశక్తిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహిళ్లల్లో నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగేందుకు నిద్రలేమి ప్రధాన కారణంగా వారు గుర్తించారు. రోజుకు కనీసం ఏడు గంటలైనా నిద్రపోని వారు బోదకాళ్ళు, నల్ల చారలు, గీతలు, శరీర ముడతలకు దారితీస్తుందని, త్వరగా వృద్దాత్వం వస్తుందని పరిశోధకులు తేల్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu