జనసేనకు భారీ షాక్..కీలక నేత రాజీనామా?
జనసేనకు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అస్సలు సత్తా చాటకపోవడంతో.. అనేకమంది కీలక నేతలు రాజీనామాలు చేశారు. ఆ ఒరవడి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు. పార్థసారథి ఎన్నికల్లో పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయారు. ఓట్ల […]
జనసేనకు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అస్సలు సత్తా చాటకపోవడంతో.. అనేకమంది కీలక నేతలు రాజీనామాలు చేశారు. ఆ ఒరవడి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా జనసేన తరఫున పోటీచేసిన చింతల పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పంపారు. పార్థసారథి ఎన్నికల్లో పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయారు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా ఉంది. కాగా ఇప్పుడు ఆయన వేరే ఏ పార్టీలో అయినా చేరతారా ? లేక రాజకీయాలకే దూరంగా ఉంటారా ? అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.
కాగా ఇటీవలే పవన్.. పార్థసారథిపై ఎంతో నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనకు ప్రభుత్వ పథకాల మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించారు. తాజాగా ఆయన పార్టీకి, మానిటరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీంతో పార్థసారథి పార్టీని వీడటం పట్ల అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతల మధ్య సమన్యయ లోపం ప్రధాన కారణంగా తెలుస్తుంది. పవన్ కూడా పార్టీ నిర్మాణం విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.