Punjab: రైతు ఉద్యమానికి ఢిల్లీకి ఇంటికొకరిని పంపకపోతే 1,500 జరిమానా.. చెల్లించకపోతే గ్రామం నుంచి బహిష్కరణ.. ఎక్కడంటే?
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లోని ఓ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి..
Farmers Protest: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన అల్లర్ల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు దాదాపు 250మందికి పైగా అదుపులోకి తీసుకోని విచారణ జరుపుతున్నారు. అంతేకాకుండా రైతు సంఘాల నేతలకు కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఢిల్లీ నుంచి చాలామంది ఇళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో బీకేయూ ప్రతినిధి రాకేష్ తికాయత్ చేసిన ఉద్వేగ ప్రసంగంతో ఉద్యమానికి ప్రజల మద్దతు భారీగా పెరుగుతోంది. వేలాది మంది రైతులు రాత్రికి రాత్రే ఢిల్లీకి పయనమయ్యారు.
ఈ క్రమంలోనే పంజాబ్‌లోని ఓ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమానికి వారం రోజులపాటు కుటుంబంలో ఒకరి చొప్పున కచ్చితంగా పంపాలని బతిండాలోని విర్క్ ఖుర్ద్ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. నిరసనకు పంపని వారికి 1,500 రూపాయల జరిమానా విధించనున్నట్లు పంచాయతీ సర్పంచ్ వెల్లడించారు. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే వారిని బహిష్కరిస్తామని విర్క్ ఖుర్ద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మంజిత్ కౌర్ వెల్లడించారు. రైతు ఉద్యమాన్ని అవమానించాలని చూస్తున్నారని.. అందుకోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఉద్యమానికి వెళ్లే గ్రామస్థులు కనీసం ఏడు రోజులపాటు అక్కడ ఉండాలని ఆమె పేర్కొన్నారు. అక్కడికి వెళ్లిన వారి వాహనానికి ఏదైనా నష్టం జరిగితే గ్రామస్థులు పరిహారం చెల్లిస్తారని ఆమె తెలిపారు.
Punjab: Virk Khurd gram panchayat in Bathinda decides to send at least one member of each family to farmers’ protest at Delhi borders for a week
“Those who won’t go to protest will be fined Rs 1,500 & those not paying fine will be boycotted,” says Sarpanch Manjit Kaur. (29.01) pic.twitter.com/XZ1n0az38B
— ANI (@ANI) January 30, 2021
Also Read:
దేశ రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఆందోళన.. ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయం