AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఆందోళన.. ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయం

దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రమవుతోంది. బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది రైతు ఉద్యమం.

దేశ రాజధానిలో ఉగ్రరూపం దాల్చుతున్న రైతుల ఆందోళన.. ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయం
Dehi farmers protest
Balaraju Goud
|

Updated on: Jan 30, 2021 | 8:23 AM

Share

Delhi farmers Protest : రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ సద్భావన దివస్ పాటించాలని నిర్ణయించారు. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతుగా యూపీలోని ముజఫర్‌నగర్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. యూపీకి చెందిన రైతులు ఢిల్లీకి తరలివచ్చి ఆందోళనకు మద్దతు పలకాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, సింఘు బార్డర్ వద్ద జరిగిన అల్లర్ల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌హెచ్‌ఓపై కత్తితో దాడి చేసిన రంజీత్ సింగ్‌తో పాటు మరో 44 మందిని అదుపలోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం తీవ్రమవుతోంది. బీకేయూ ప్రతినిధి రాకేష్‌ తికాయత్‌ ఉద్వేగ ప్రసంగంతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది రైతు ఉద్యమం. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..మళ్లీ సరిహద్దులకు వేలాదిగా తరలివస్తున్నారు అన్నదాతలు. ఉద్యమాన్ని విచ్చిన్నం చేసే కుట్ర జరుగుతోందని, తమ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ రెండో దశ పోరాటం చేపట్టాలని రైతు సంఘాలు డిసైడ్ అయ్యాయి. యూపీ, హర్యానా రాష్ట్రాల నుంచి పోటెత్తారు. ఒక్కటేంటి మీరట్‌, బిజ్నోర్, బాగ్‌పట్‌, ముజఫర్‌నగర్‌, మొరాదాబాద్‌, బులంద్‌షహర్‌ ఇలా అన్ని జిల్లాల నుంచి ఘాజీపూర్‌ చేరుకుంటున్నారు వేలాదిమంది అన్నదాతలు. నిన్న మొన్నటి వరకు 2 వేలుగా ఉన్న రైతన్నలు..ఇవాళ 20వేల మందికి పైగా చేరింది.

ఘాజీపూర్‌ సరిహద్దుల్లో స్థానికులకు, అన్నదాతలకు మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీంతో అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ రైతులపై ఒత్తిడి పెంచారు పోలీసులు. రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలని చూశారు. కానీ ఖాకీల ప్రయత్నం వృథా అయింది. మీ తూటాలకు భయపడేది లేదంటూ తెగేసి చెప్పారు రాకేష్‌ తికాయత్‌. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే, రాకేష్‌ తికాయత్‌పై తప్పుడు కేసులు పెట్టారని.. ఆయన్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించిన రైతు సంఘాలు.. సరిహద్దులను ఖాళీ చేసే ప్రసక్తే లేదంటున్నారు. వేలాదిగా కదం తొక్కుతున్న అన్నదాతలతో సింఘు , ఘాజీపూర్‌ , టిక్రీ సరిహద్దుల్లో హైటెన్షన్‌ వాతావరణం కన్పిస్తోంది.

ఇక, ఇవాళ గాంధీ వర్థంతి సందర్భంగా..సద్భావనా దివస్‌ను పాటించాలని నిర్ణయించారు రైతులు. సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ సరిహద్దుల్లో నిరాహార దీక్షకు దిగారు. మరోవైపు, హర్యానాలో ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పుకార్లు కంట్రోల్‌ చేసేందుకు ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చదవండిః మిక్సోపతికి వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన వైద్యులు.. ఫిబ్రవరి 1 నుండి ఐఎంఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై