AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections – BJP: కేంద్ర కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు ఇస్తారట.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ..!

Elections - BJP: ఎన్నికలు ఎక్కడుంటే.. అక్కడి ప్రధాన పార్టీలు అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా తమ రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతుంటాయి.

Elections - BJP: కేంద్ర కేబినెట్‌లో చోటు, భారీగా డబ్బు ఇస్తారట.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ..!
Mp Bhagwant Mann
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 23, 2021 | 6:47 PM

Share

Elections – BJP: ఎన్నికలు ఎక్కడుంటే.. అక్కడి ప్రధాన పార్టీలు అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా తమ రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని ప్రముఖ నేతలను తమవైపు లాక్కునేందుకు సామ దాన దండోపాయ సిద్ధాంతాన్ని పాటిస్తుంటాయి. కేంద్రంలోని బీజేపీ కూడా ఇప్పుడు అదే విధానాన్ని అవలంభిస్తోందట. పంజాబ్‌ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రధాన పార్టీల నేతలను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందట బీజేపీ నాయకత్వం. ఇదే విషయంలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ భగవంత్ మాన్.. బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తనకు డబ్బు ఆశచూపారని, అంతే కాదు కేంద్ర కేబినెట్‌లో చోటు కూడా కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపించారు. ‘‘ బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత.. నాతో మాట్లాడారు… పార్టీలో చేరేందుకు మీకు ఏం కావాలి? డబ్బులేమైనా కావాలా? మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్‌లో కావల్సిన పోస్టు ఇస్తాం అని అన్నారు.’’ అంటూ బీజేపీ ప్రలోభాల గురించి మీడియా ఎదుట వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు తనతో బేరసారాలు నడిపిన బీజేపీ నేత పేరును కూడా బయటపడెతానని అన్నారు. తనకే కాదని, తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ గాలం వేస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు. తాను ఎవరికీ అమ్ముడుపోయే రకం కాదన్న ఆయన.. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు.

Also read:

Walking house: నడిచే ఇల్లు.. ఇక వాటితో పని లేదంతే.. క్రియేటర్‌కు సలా కొట్టాల్సిందే..!

Cheekati Koneru Secrete: మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం.. అసలు రహస్యం ఇదేనా?..

Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష.. ప్రకటించిన జుంటా అధికార ప్రతినిధి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!