బాబుకు మరో షాక్.. వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే

ఎన్నికల తేది సమీపిస్తోన్న వేళ ఏపీలో వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైసీపి కండువాలను కప్పుకోగా.. తాజాగా మరో టీడీపీ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టికెట్‌ను ఈ సారి నెలపూడి స్టాలిన్‌కు బాబు కేటాయించడంతో మనస్తాపానికి గురైన నారాయణ మూర్తి టీడీపీని వీడారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 23, 2019 | 11:02 AM

ఎన్నికల తేది సమీపిస్తోన్న వేళ ఏపీలో వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైసీపి కండువాలను కప్పుకోగా.. తాజాగా మరో టీడీపీ నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పి.గన్నవరం టికెట్‌ను ఈ సారి నెలపూడి స్టాలిన్‌కు బాబు కేటాయించడంతో మనస్తాపానికి గురైన నారాయణ మూర్తి టీడీపీని వీడారు.

మరోవైపు ఈ రోజు నారాయణ మూర్తి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పిఠాపురంలో జరిగే వైసీపీ సభలో భారీ సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో ఆయన వైసీపీ కండువాను కప్పుకోనున్నారు. అయితే వైసీపీలో నారాయణమూర్తికి జగన్ ఏ బాధ్యత అప్పగిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu