విజయవాడ బరిలో కుబేరులు

శుక్రవారం రోజు సుముహూర్తం కావడంతో ఏపీలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి అధికార టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, వైసీపీ తరఫున వ్యాపారవేత్త పొట్లూరు వ‌ర ప్రసాద్‌లు పోటీచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీవీపీ తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల […]

విజయవాడ బరిలో కుబేరులు
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:21 AM

శుక్రవారం రోజు సుముహూర్తం కావడంతో ఏపీలో పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి అధికార టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, వైసీపీ తరఫున వ్యాపారవేత్త పొట్లూరు వ‌ర ప్రసాద్‌లు పోటీచేస్తున్నారు. వీరిద్దరూ శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీవీపీ తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను ఆయన వెల్లడించారు. కుటుంబానికి ఉన్న అప్పులు రూ.20.95 కోట్లుగా చూపించారు.

పీవీపీ పేరుతో రూ.39.36 కోట్లు, భార్య ఝాన్సీ పేరిటి రూ.196.60కోట్లు, ఇద్దరు పిల్లల పేరిట రూ.32.95లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్టు వెల్లడించారు. పీవీపీకి రూ.45.95 కోట్లు, భార్యకు రూ.65.51 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. అప్పులు సైతం పీవీపీ పేరుతో రూ.2.91 కోట్లు, భార్యకు రూ.18.03 కోట్లు ఉన్నట్టు చూపించారు

టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌(నాని) తన అఫిడవిట్‌లో కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.80.82 కోట్లుగా చూపించారు. ఆయన పేరుతో అప్పులు రూ.51.23 కోట్లున్నాయని,. మరో రూ.23.29 కోట్ల వివాదాస్పద బకాయిలు సైతం ఉన్నట్టు తెలిపారు. నాని పేరుతో రూ.10.62కోట్లు, భార్య పావని పేరుతో రూ.1.61కోట్లు, కుమార్తెలు శ్వేత, ప్రసూనాంబల పేరుతో రూ.1.13కోట్ల విలువైనవి చరాస్తులున్నట్టు వెల్లడించారు. అలాగే స్థిరాస్తుల విషయానికి వస్తే నాని పేరు మీద రూ.66.07కోట్లు, భార్యకు రూ.1.36కోట్ల విలువైనవి ఉన్నట్టు పొందుపరిచారు.