పెను దిగ్గజాల ఓటమి ! ఎందుకిలా ?

అవును..ఒకప్పుటి విన్నర్లే ఇప్పుడు లూజర్లయ్యారు. నిన్నటివరకు హీరోలైన వీరంతా నేడు జీరోలయ్యారు. కమలనాథులకు గట్టి పోటీనిస్తారనుకున్న వీళ్ళు ఇప్పుడు ‘ కెవ్వు ‘ మన్నారు. మాహాకూటమి పేరుతో ఒకే వేదిక మీద చేతులూపిన ఘనాపాటీలు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేసినవాళ్ళు ముఖాలు మాడ్చుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కేరళ సిఎం పినరయి విజయన్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, యూపీలో […]

పెను దిగ్గజాల ఓటమి ! ఎందుకిలా ?
Follow us

|

Updated on: May 23, 2019 | 6:39 PM

అవును..ఒకప్పుటి విన్నర్లే ఇప్పుడు లూజర్లయ్యారు. నిన్నటివరకు హీరోలైన వీరంతా నేడు జీరోలయ్యారు. కమలనాథులకు గట్టి పోటీనిస్తారనుకున్న వీళ్ళు ఇప్పుడు ‘ కెవ్వు ‘ మన్నారు. మాహాకూటమి పేరుతో ఒకే వేదిక మీద చేతులూపిన ఘనాపాటీలు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేసినవాళ్ళు ముఖాలు మాడ్చుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కేరళ సిఎం పినరయి విజయన్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, యూపీలో మాయావతి, అఖిలేష్ ద్వయం.. తాజాగా..’ ప్రజా తీర్పు ‘ ను శిరసావహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీకి సవాలు నిచ్చే గట్టి ప్రతిపక్ష నేతగా పాపులరైన రాహుల్.. ఒకవేళ ఎన్డీయే ఓటమి చెందితే భావి ప్రధాని అభ్యర్థి అని ఈయనను విపక్షాలు ప్రకటించాయి. కానీ వయనాడ్ లో గెలిచినా.. అమేథీ నియోజకవర్గంలో రాహుల్ పరిస్థితి ఏమిటన్నది ఇంకా తేలలేదు. (సాయంత్రం దాదాపు 5 గంటలైనా).. ముఖ్యంగా ఈ సీట్లోనే ఆయన గెలవాల్సి ఉంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి ఊహించని విషయం. ఆయన ప్రత్యర్థి, వైసీపీ అధినేత జగన్ గెలుపు ఆయనకు మింగుడు పడడంలేదు. ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండింటి లోనూ టీడీపీ ఘోర  ఓటమి ఆయనకు చేదు నిజం. కేంద్రంలో 23 పార్టీలతో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు ఆశలు అడియాసలయ్యాయి. కేరళలో సిఎం  పినరయి విజయన్ కు చుక్కెదురయింది. కేరళ చరిత్రలోనే సీపీఎం చావుదెబ్బ తింది. ఈ పార్టీ ప్రత్యర్థి యూడీఎఫ్ సుమారు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పెద్ద రాష్ట్రమైన యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీని ఓడించేందుకు చేతులు కలిపినా వారి పాచికలు పారలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసికి బీజేపీ గట్టి పోటీ నివ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. కర్నాటక తుంకూరు నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో గెలిచి.. అంతా బాగుంటే మళ్ళీ ప్రధాని కావచ్చునన్న ఆయన ఆశలు అడియాసలయ్యారు.  ఇలా. వీళ్ళంతా మోదీ, బీజేపీ ప్రభంజనం ముందు తలవంచక తప్పలేదు.

Latest Articles
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఐసెట్ 2024 పరీక్షలు
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
ఆ గ్యాడ్జెట్ పై అదిరే ఆఫర్.. కేవలం రూ. 30వేలకే టాప్ క్లాస్
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
స్టేషన్​ మాస్టర్ డీప్ స్లీప్.. అరగంట నిలిచిపోయిన రైలు
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
టాస్ గెలిచిన పంజాబ్.. ఇరుజట్లలో ఇంపాక్ట్ ప్లేయర్స్‌గా ఎవరంటే?
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
దేశ వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం.. నిర్మల్ సభలో రాహుల్
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్‌) 2024నోటిఫికేషన్‌ విడుదల
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
ముఖం మెరిసిపోవాలా.? వాల్‌నట్స్‌ స్క్రబ్‌తో సాధ్యమే..
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
వీళ్లు మాములోళ్లు కాదురా బాబోయ్.. నట్టింట్లో...
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ
కార్ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా.? ఏ బ్యాంక్‌ ఎంత వడ్డీ