కవితకు ఝలక్…. అరవింద్ గెలుపు

అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకున్నారు. గత ఐదేళ్లలో తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో… కవితకు ఓట్ల రూపంలో ప్రతీకారం తీర్చుకున్నారు. 2014లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్ నెరవేరకపోవడంతో.. కవితపై పోటీకి.. ఏకంగా 178 మంది రైతులు బరిలోకి దిగారు. మరోవైపు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీ. శ్రీనివాస్ […]

కవితకు ఝలక్.... అరవింద్ గెలుపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 23, 2019 | 6:48 PM

అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకున్నారు. గత ఐదేళ్లలో తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో… కవితకు ఓట్ల రూపంలో ప్రతీకారం తీర్చుకున్నారు. 2014లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలుపొందారు. అయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. అయితే వారి డిమాండ్ నెరవేరకపోవడంతో.. కవితపై పోటీకి.. ఏకంగా 178 మంది రైతులు బరిలోకి దిగారు.

మరోవైపు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డీ. శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ కవితపై బీజేపీ నుంచి ఇక్కడి నుంచి పోటీకి దిగారు. పసుపు రైతుల డిమాండ్లను నెరవేరుస్తానని.. కేంద్రం ఇవ్వకపోతే… తన సోంత డబ్బుతో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి.. రైతులను ఆకట్టుకున్నారు. మరోవైపు తండ్రికి కాంగ్రెస్ పార్టీ ద్వీతియ శ్రేణి కార్యకర్తలతో ఉన్న అనుబంధం.. గత కొద్ది రోజులుగా అరవింద్ చేపట్టిన సామాజిక కార్యక్రమాలు ఆయన గెలుపుకు బాసటగా నిలిచాయి. మొత్తానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితపై 68 వేల ఓట్ల మెజార్టీతో అరవింద్ విజయం సాధించారు.