AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాండ్యలో చారిత్రాత్మక విజయం సాధించిన సుమలత

దివంగత నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంబరీశ్‌ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మాండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలతకు ఆ పార్టీ టికెట్‌ ఇవ్వలేకపోయింది. దీంతో అసహనానికి […]

మాండ్యలో చారిత్రాత్మక విజయం సాధించిన సుమలత
Anil kumar poka
|

Updated on: May 23, 2019 | 7:10 PM

Share

దివంగత నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంబరీశ్‌ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మాండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలతకు ఆ పార్టీ టికెట్‌ ఇవ్వలేకపోయింది. దీంతో అసహనానికి గురైన సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

అటు జేడీఎస్‌ ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామిని బరిలోకి దింపింది. సీఎం కుమారస్వామి కుమారుడైన నిఖిల్‌ తాజా ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దీంతో తమకు ఎంతో పట్టున్న మాండ్య నుంచి నిఖిల్‌ను పోటీలో నిలబెట్టింది జేడీఎస్‌. మరో విషయమేంటంటే నిఖిల్‌ కూడా సినీనటుడే. మరోవైపు సుమలతకు మద్దతిచ్చేందుకు బీజేపీ ఇక్కడ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దీంతో మాండ్య పోరు ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరులో నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. మండ్య ఎన్నికల్లో ఒక్కళిగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సుమలత ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు కాకపోయినా అంబరీశ్‌ అదే కులానికి చెందినవారు. ఇది ఆమెకు కలిసొచ్చింది. దీంతో పాటు కన్నడ సినీప్రముఖుల మద్దతు కూడా సుమలతకే ఉండటంతో హోరాహోరీ పోరులో ఆమె గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. అంతేగాక.. 52ఏళ్ల తర్వాత మాండ్య నుంచి లోక్‌సభకు వెళ్తున్న తొలి మహిళా స్వతంత్ర ఎంపీగా గుర్తింపు సాధించారు.