మోదీపై రాహుల్ స్లోగన్ ఫ్లాప్ !

ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ,లతో బాటు రాహుల్ తన సోదరి ప్రియాంక గందీతోను, ఇతర నేతలతోను పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోనున్నారు.  2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ కి ఇది రెండో ఓటమి. మోదీ, బీజేపీ ఘన విజయంతో తాము ప్రజా తీర్పును శిరసావహిస్తామని రాహుల్ ప్రకటించక తప్పలేదు. 542 సీట్లున్న లోక్ సభలో బీజేపీ […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 7:03 pm, Thu, 23 May 19
మోదీపై రాహుల్ స్లోగన్ ఫ్లాప్ !
ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ,లతో బాటు రాహుల్ తన సోదరి ప్రియాంక గందీతోను, ఇతర నేతలతోను పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోనున్నారు.  2014 ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్ కి ఇది రెండో ఓటమి. మోదీ, బీజేపీ ఘన విజయంతో తాము ప్రజా తీర్పును శిరసావహిస్తామని రాహుల్ ప్రకటించక తప్పలేదు. 542 సీట్లున్న లోక్ సభలో బీజేపీ దాదాపు 350 సీట్లు రాగా, కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు 93 సీట్లకు పరిమితమయ్యాయి.  అమేథీలో రాహుల్ ఓటమి దిశగా పయనించడం ఆ పార్టీకి ఘోరమైన చెడు నుజం. ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ను కాంగ్రెస్ అసలు ఊహించలేదు. యూపీలో ప్రియాంక గాంధీ సైతం విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. మోదీని ఉద్దేశించి రాహుల్.. ‘ చౌకీదార్ చోర్ హై ‘ అంటూ రాహుల్ చేసిన ప్రచార నినాదం  తుస్సుమంది. పైగా ఆ పార్టీకి చుక్కెదురయింది. న్యాయ్, న్యాయ్ న్యూతమ్ ఆయ్ యోజన వంటి పథకాల గురించి ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది కల్ల. అసలు రాహుల్ నాయకత్వాన్నే సీనియర్ నేతలు ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది. ఇక తన అంతర్మథనం లో పార్టీ ఏ ‘ కొత్త స్లోగన్ ‘ జోలెకీ పోదనే ఆశిద్దాం అంటున్నారు విశ్లేషకులు.