మోదీ, అమిత్ షాలకు అద్వాణీ ప్రశంసలు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయం దిశగా నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ ప్రశంసల వర్షం కురిపించాడు. పార్టీకి గతంలో ఎన్నడూ రానంత మెజారిటీతో విజయాన్ని అందించిన వీరిద్దరిని అద్వాణీ అభినందించారు. ‘‘బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని అందించిన నరేంద్ర మోదీకి అభినందనలు. ఇక బీజేపీ సందేశాన్ని దేశంలో ప్రతీ ఓటరుకు చేరేలా కృషి చేసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు, ప్రతీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:50 pm, Thu, 23 May 19
మోదీ, అమిత్ షాలకు అద్వాణీ ప్రశంసలు

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని విజయం దిశగా నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలపై సీనియర్ నేత ఎల్‌కే అద్వాణీ ప్రశంసల వర్షం కురిపించాడు. పార్టీకి గతంలో ఎన్నడూ రానంత మెజారిటీతో విజయాన్ని అందించిన వీరిద్దరిని అద్వాణీ అభినందించారు.

‘‘బీజేపీకి గతంలో ఎన్నడూ లేనంత గొప్ప విజయాన్ని అందించిన నరేంద్ర మోదీకి అభినందనలు. ఇక బీజేపీ సందేశాన్ని దేశంలో ప్రతీ ఓటరుకు చేరేలా కృషి చేసిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు, ప్రతీ పార్టీ కార్యకర్తకు నా కృతజ్ఞతలు. ఇంత పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ ఇంత ప్రశాంతంగా జరగడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ఎన్నికల సంఘానికి, మిగితా ఏజెన్సీలకు నా అభినందనలు. తమ దేశం మరింత ఉజ్వల భవిష్యత్తుతో ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని అద్వాణీ పేర్కొన్నారు.