Political Clash: అభివృద్ధిపై YCP.. TDP మాటల తూటాలు.. ఉత్తరాంధ్ర వైపు టర్న్ తీసుకున్న ఏపీ రాజకీయాలు..

ఈ రెండేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖకు మద్దతు ఇస్తారా లేదా? ఇవి.. TDP, YCP నేతల మధ్య నడిచిన డైలాగ్ వార్.

Political Clash: అభివృద్ధిపై YCP.. TDP మాటల తూటాలు.. ఉత్తరాంధ్ర వైపు టర్న్ తీసుకున్న ఏపీ రాజకీయాలు..
Tdp And Ycp Clash Over Vis
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 30, 2021 | 7:56 PM

దమ్ముంటే చర్చకు రావాలి.! మీరు వస్తారా.. మమ్మల్ని రమ్మంటారా? ఈ రెండేళ్లలో ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖకు మద్దతు ఇస్తారా లేదా? ఇవి.. TDP, YCP నేతల మధ్య నడిచిన డైలాగ్ వార్. ఉత్తరాంధ్ర రక్షకులెవరు? భక్షకులెవరూ అంటూ సవాళ్లతో పాలిటిక్స్‌ను ఒక్కసారిగా హీటెక్కించారు. ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఉత్తరాంధ్రవైపు టర్న్ తీసుకున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ అభివృద్ధికి ఎవరేం చేశారు అన్న అంశంపై రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో విశాఖలో చర్చావేదిక నిర్వహించింది తెలుగుదేశం. ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు.. 3 జిల్లాలకు చెందిన సీనియర్లు హాజరయ్యారు. TDP ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటింది ఈ మీటింగ్. హుదూద్‌, తిత్లీ తుపాను వచ్చినట్టు వైసీపీ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించింది.

జిల్లాల వారీగా తీర్మానాలు చేశారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రకు ఫ్యాక్షన్ రాజకీయాల్ని తీసుకురావద్దని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, గంగవరం పోర్టుపై ప్రభుత్వ వైఖరిని నేతలు తప్పుపట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు..అటు పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని చర్చావేదికలో తీర్మానించారు. YCP ఉత్తరాంధ్రకు ఏం చేయలేదు కాబట్టి.. ఆ అంశాన్ని మరుగున పడేసేందుకే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.

TDP చర్చావేదికపై YCP సెటైర్లు విసిరింది. అభివృద్ధి తర్వాత ముుందు ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా విశాఖకు మద్దతిస్తారో లేదో చెప్పాలని సవాల్ విసిరారు. మీరొస్తారా? మమ్మల్ని రమ్మంటారా? అని ఛాలెంజ్ చేశారు. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా ఉత్తరాంధ్రవైపు మళ్లాయి..అభివృద్ధి ఘనత మాదే అంటోంది టీడీపీ. మా హయాంలోనే ప్రగతి అంటోంది YCP.

ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..

నల్లధనం తెప్పించారా.. అకౌంట్‌లో వేశారా.. బీజేపీపై మంత్రి హరీష్ రావు ప్రశ్నల వర్షం..