Asaduddin Owaisi: “తాలిబన్లను టెర్రరిస్టులని పిలవరు.. వారి పాలనపై ఒక్క ప్రకటన కూడా చెయ్యరు”.. మోదీ సర్కార్‌పై అసదుద్దీన్‌ ఫైర్

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ పాలసీపై ప్రధాని మోదీని ఓవైసీ టార్గెట్‌ చేశారు. బీజేపీ నేతలు ...

Asaduddin Owaisi: తాలిబన్లను టెర్రరిస్టులని పిలవరు.. వారి పాలనపై ఒక్క ప్రకటన కూడా చెయ్యరు.. మోదీ సర్కార్‌పై అసదుద్దీన్‌ ఫైర్
Asaduddin Owaisi
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 30, 2021 | 8:46 PM

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌ పాలసీపై ప్రధాని మోదీని ఓవైసీ టార్గెట్‌ చేశారు. బీజేపీ నేతలు తమ ప్రత్యర్ధులంతా ఆఫ్ఘనిస్తాన్‌ వెళ్లిపోవాలని సెటైర్లు విసురుతున్నారని , కాని ప్రధాని మోదీ తప్ప ఆఫ్గనిస్తాన్‌కు ఇంకే నేత వెళ్లలేదని ట్వీట్‌ చేశారు ఓవైసీ. తమ ప్రత్యర్ధులను బీజేపీ నేతలు తాలిబన్లు అని విమర్శిస్తున్నారని , కాని తాలిబన్లు ఆక్రమించిన దేశానికి మోదీ మూడు బిలియన్‌ డాలర్ల సాయం చేసిన విషయాన్ని మర్చారని అన్నారు. తాలిబన్లను ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం టెర్రరిస్టులని పిలవడం లేదని విమర్శించారు. తాలిబన్‌ 2 పాలనపై మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో ప్రధాని మోదీ రెండు నాల్కల ధోరణణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

చైనాపై కూడా మోదీ బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని బీజేపీ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని , విపక్ష నేతలను చైనా ఏజెంట్లని విమర్శిస్తున్నారని , కాని మోదీ అధికారం లోకి వచ్చాక చైనాతో వ్యాపారం రెట్టింపయ్యిందని విమర్శించారు. ఇతర దేశాలతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకున్న మోదీ ప్రభుత్వం చైనాతో మాత్రం పెంచుకుందన్నారు. చైనా పేరు ఎత్తడానికే ప్రధాని మోదీ భయపడుతున్నారని మండిపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినప్పటికి వాస్తవాన్ని ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదన్నారు. చైనాతో కూడా మోదీ సర్కార్ సీక్రెట్‌ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. చైనా అంటే మోదీకి ఎందుకు భయమని ప్రశ్నించారు అసదుద్దీన్‌ ఓవైసీ. బీజేపీ నేతలు దీనిపై సమాధానం చెప్పాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు. కర్నాటకలో స్ధానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు. యూపీలో యోగి ప్రభుత్వం తమ పార్టీ నేతలను హత్య చేయిస్తోందని ఆరోపించారు.

Also Read:కారు గల్లంతు ఘటనలో డ్రైవర్‌ ఆచూకీ లభ్యం.. వరదలో చెట్టు కొమ్మ చిక్కడంతో

Ganji: అయ్యో..! అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? పెద్ద తప్పే చేస్తున్నారు..