మోదీ ప్రమాణం.. పట్టించుకోని పాకిస్థాన్!

ఈ నెల 30 న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ… సార్క్ దేశాధినేతలను కాకుండా కొత్త వ్యూహం అనుసరించారు. కిర్గిజ్ రిపబ్లిక్, మారిషస్ నేతలను ఆయన ఆహ్వానించడం విశేషం. (ఈ రెండూ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ దేశాల..( బిమ్‌స్టిక్).. కూటమిలో ఉన్నాయి. వీటితో బాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి). ఈ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా మోదీ .. అత్యంత దౌత్య చతురతను […]

మోదీ ప్రమాణం.. పట్టించుకోని పాకిస్థాన్!
Follow us

| Edited By: Srinu

Updated on: May 28, 2019 | 7:56 PM

ఈ నెల 30 న జరిగే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ… సార్క్ దేశాధినేతలను కాకుండా కొత్త వ్యూహం అనుసరించారు. కిర్గిజ్ రిపబ్లిక్, మారిషస్ నేతలను ఆయన ఆహ్వానించడం విశేషం. (ఈ రెండూ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ దేశాల..( బిమ్‌స్టిక్).. కూటమిలో ఉన్నాయి. వీటితో బాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి). ఈ దేశాధినేతలను ఆహ్వానించడం ద్వారా మోదీ .. అత్యంత దౌత్య చతురతను ప్రదర్శించారు. పాకిస్థాన్ ను పక్కన బెట్టి బే ఆఫ్ బెంగాల్ నుంచి సెంట్రల్ ఆసియా వరకు భారత దేశ సంబంధాలు విస్తృతం కానున్నాయన్న సూచనను అయన చెప్పకనే చెప్పారు. గతంలో మోదీ సార్క్ దేశాధినేతలను, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని ఆహ్వానించడంతో పాకిస్థాన్ తో భారత సంబంధాలు మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ..పుల్వామా ఘటన నేపథ్యంలో మోదీ ఈ సారి పాక్ అధినేతను పక్కన బెట్టారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధినేతను ఇన్వైట్ చేయడం ద్వారా ఇండియా.. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ ని కూడా ఆదరించినట్టు స్పష్టమవుతోంది. కిర్గిజ్ నేత ఆధ్వర్యంలోని ఈ ఆర్గనైజేషన్ లో చైనా, రష్యా, ఉజ్బేకిస్తాన్, కజకిస్థాన్, తజకిస్థాన్, పాకిస్తాన్ దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. 2017 లో పాక్ తో బాటు ఇండియా కూడా ఈ సంస్థలో సభ్యత్వం పొందింది. ఇక మారిషస్ ప్రధాని ప్రవింద జగన్నాథ్ కి ఇండియాతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. 2016 లో గోవాలో జరిగిన సమ్మిట్ లో బిమ్‌స్టిక్ దేశాధినేతలతో మోదీ సమావేశమయ్యారు. అప్పుడే వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. యూరీ దాడుల విషయంలో పాకిస్తాన్ ను ఆ దేశాధినేతలంతా తప్పు పట్టి ఏకాకిని చేశారు. పైగా గత ఏడాది సెప్టెంబరులో నేపాల్ లో జరిగిన బిమ్‌స్టిక్ సమ్మిట్… కౌంటర్ టెర్రరిజాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ పరిణామాలతో మోదీ.. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరిని ఆహ్వానించడం మంచి రాజకీయ చాతుర్యాన్ని  ప్రదర్శించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించరాదన్న భారత్ నిర్ణయం పట్ల పాకిస్థాన్ పెద్దగా స్పందించలేదు. బహుశా మోదీ ఆంతరంగిక రాజకీయాలే ఇందుకు కారణం అయి ఉంటాయని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి అభిప్రాయపడ్డారు. దీని బదులు కాశ్మీర్ సమస్యపై చర్చలకు ఆహ్వానిస్తే బాగుండేదని ఆయన అన్నారు. గతేడాది ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఆయనకు మోదీ శుభాకాంక్షలు తెలిపారని.. పైగా లేఖ కూడా రాశారని ఆయన గుర్తు చేశారు.