MLA Jagga Reddy: గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ వెనుక మోడీ.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహణ వెనుక ప్రధాని మోడీ, రాష్ట్రపతి ఉన్నారని విమర్శించారు జగ్గారెడ్డి. రాజకీయ కోణంలోనే మహిళా దర్బార్ నిర్వహించారని ఆరోపించారు.
గవర్నర్ తమిళిసై మహిళా దర్బార్ నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహణ వెనుక ప్రధాని మోడీ ఉన్నారని విమర్శించారు జగ్గారెడ్డి. రాజకీయ కోణంలోనే మహిళా దర్బార్ నిర్వహించారని ఆరోపించారు. అసలు గవర్నర్ కి ఏ అధికారి మీద యాక్షన్ తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పించిందో చెప్పాలని ప్రశ్నించారు జగ్గారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానీయకుండా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. లోపాయికార ఒప్పందంలో భాగంగానే టీఆర్‌ఎస్, బీజేపీ పరస్పరం విమర్శించుకుంటున్నాయని కామెంట్ చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ డైరెక్షన్‌తోనే గవర్నర్ మహిళా దర్బార్ పెట్టారని ఆరోపించారు. గవర్నర్ మహిళా దర్బార్ పెట్టడం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని, ఇది పూర్తిగా రాజకీయమేనని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్‌తో మహిళలకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు గర్నర్ చర్యలు తీసుకోలేదన్నారు.
గవర్నర్ జిల్లాలకు వెళితే కలెక్టర్, ఎస్పీలు రాని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్లు, ఎస్పీలపైనే ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు…ఇక మహిళల సమస్యలను గవర్నర్ ఏం తీరుస్తారు? అంటూ ఆయన ప్రశ్నించారు. నామమాత్రపు దర్బార్‌లతో మహిళలకు ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే.. సుమారు 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు Mahila Darbar కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు గంటకు పైగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా మహిళలు చెప్పుకున్న బాధలను గవర్నర్ విన్నారు. సీరియస్ కేసులకు సంబంధించిన బాధలను గవర్నర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని పరోక్షంగా కేసీఆర్ సర్కార్ కు ఆమె చురకలంటించారు. రాజ్ భవన్ ఎలాంటి హద్దులు దాటడం లేదని స్పష్టం చేశారు. రాజ్ భవన్ ను గౌరవించకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నామని… ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని తమిళిసై అభిప్రాయపడ్డారు.