AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife and Husband: ఫస్ట్ నైట్ రోజు భార్య శరీరంపై ఆ మచ్చలు చూసిన భర్త.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

Wife and Husband: హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్లతో ఒక్కటైన దంపతులు..

Wife and Husband: ఫస్ట్ నైట్ రోజు భార్య శరీరంపై ఆ మచ్చలు చూసిన భర్త.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
Wife And Husband
Shiva Prajapati
|

Updated on: Jun 10, 2022 | 5:53 PM

Share

Wife and Husband: హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్లతో ఒక్కటైన దంపతులు.. కడవరకూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. అయితే, వందేళ్లపాటు సంతోషంగా సాగాల్సిన వివాహ బంధానికి.. కొన్నేళ్లకే బీటలు పడుతున్నాయి. కారణం.. దంపతుల మధ్య దాపరికాలు. ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యాలు దాచుకోవడం, అబద్ధాలు చెప్పడం వంటివి. వివాహం జీవితంలో పొరపచ్చాలు, వివాదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా అబద్ధాలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి.

తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిని ఓ సంఘటన చర్చనీయాంశమైంది. తన భార్య పెళ్లికి ముందే.. అబార్షన్ చేయించుకున్నట్లు గుర్తించిన భర్త ఆమెను కాపురానికి తీసుకెళ్లలేదు. పైగా భార్య తనపై వరకట్న వేధింపుల కేసు పెట్టగా.. అసలు విషయాన్ని బహిర్గతం చేశాడు. నిజమేంటో తెలుసుకునేందుకు ఆర్టీఐ దరఖాస్తు పెట్టాడు. అసలు బట్టబయలు అవడంతో.. అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని శివపురిలో రెండేళ్ల క్రితం యువకుడికి, యువతికి నిశ్చితార్థం జరిగింది. అయితే, అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ తరువాత వీరిద్దరికీ వివాహం జరిగింది. హనీమూన్‌కు వెళ్లగా అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్య కడుపుపై ఆపరేషన్ చేసినట్లుగా మచ్చలు ఉండటంతో అతను అనుమానించాడు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. ఆ తరువాత హనీమూన్ నుంచి తిరిగి వచ్చాక.. అసలు వివాదం స్టార్ట్ అయ్యింది. పుట్టింటికి వెళ్లిన వధువును.. వరుడు తన ఇంటికి తీసుకెళ్లేలేదు. చాలా రోజులు గడిచినప్పటికీ.. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దాంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులు అతనిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. అదే సమయంలో భార్య కడుపుపై ఉన్న కుట్ల గురించి సమాచారం లాగడం ప్రారంభించాడు. అప్పుడే అసలు విషయం బహిర్గతం అయ్యింది.

స్కూల్ టీచర్‌తో అఫైర్..

ఇవి కూడా చదవండి

పెళ్లి అయిన మూడు రోజులకే భార్య మరో వ్యక్తితో మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించిందని భర్త ఆరోపించాడు. అప్పటి నుంచి ఆమెపై అతనికి అనుమానం పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందు ఆమె జీవితం గురించి ఆరా తీశాడు భర్త. ఆ సమయంలో అతనికి కొన్ని వివరాలు రాబట్టాడు. అమ్మాయి పెళ్లికి ముందు ఒక స్కూల్‌లో చదువు చెప్పేందుకు వెళ్లేదని, అక్కడ ఓ ఉపాధ్యాయుడితో ఆమెకు అఫైర్ నడిచిందని తెలుసుకున్నాడు. దాంతో ఇంకాస్త లోతుగా విచారణ జరిపాడు భర్త. వివాహానికి ముందు తన భార్య అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలుసుకున్నాడు. దీనిపై సమాచారం అడిగితే ఆస్పత్రి యాజమాన్యం చెప్పలేదు. దాంతో అతను ఆర్టీఐ సహాయం తీసుకున్నాడు. ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణకు ప్రయత్నించి సఫలం అయ్యాడు. తన భార్యకు పెళ్లికి ముందే అబార్షన్ అయ్యిందని అందులో తెలుసుకుని షాక్ అయ్యాడు.

పెళ్లికి మూడు నెలల ముందే అబార్షన్..

వివాహానికి మూడు నెలల ముందు తన భార్య అబార్షన్ చేయించుకున్నట్లు సమాచార హక్కు వెల్లడించింది. షాకింగ్ విషయం ఏంటంటే.. మెడికల్ రిపోర్టులో పెళ్లికి ముందే భర్త పేరు రాసి ఉంది. ఈ విషయం తనకు తెలియదని, ఎవరూ చెప్పలేదని, తెలిస్తే పెళ్లికి నిరాకరించేవాడినని భర్త చెబుతున్నాడు. ఆర్టీఐ నుంచి అందిన ఈ సమాచారాన్ని ఇప్పుడు భర్త తన లాయర్ ద్వారా కోర్టులో సమర్పించాడు. మరోవైపు భర్తపై భార్య కోర్టులో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇరువురి పిటిషన్లు కోర్టులో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..