అభివృద్ధిని చూసి ఓటేయండి.. శాఖల వారీగా ఉద్యోగాల లెక్కలు చెప్పేసిన మంత్రి ఎర్రబెల్లి

అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి. భారీ మెజారిటీ తో ఎన్నుకోండి అని పట్టభద్రుల ఓటర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్..

అభివృద్ధిని చూసి ఓటేయండి.. శాఖల వారీగా ఉద్యోగాల లెక్కలు చెప్పేసిన మంత్రి ఎర్రబెల్లి
Follow us

|

Updated on: Feb 26, 2021 | 12:27 PM

అభివృద్ధిని చూడండి. ఓటు వేయండి, అభ్యర్థి ని చూడండి. భారీ మెజారిటీ తో ఎన్నుకోండి అని పట్టభద్రుల ఓటర్లకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పట్టభద్రుల ఓటర్లకు పిలుపునిచ్చారు. విద్యాధికుడు, విద్యాసంస్థల అధినేత, మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తి, మన సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వద్ద చెప్పే చనువు ఉన్న నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ గా భారీ మెజారిటీతో గెలిపించాలని నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నేడు కురవి లో టీఆరెఎస్ పార్టీ నాయకులు, పట్టభద్రుల తో నిర్వహించిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపి మాలోత్ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.

సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ… పట్టభద్రుల ఓటర్లు అంటే, చదువుకున్న వారు, ఆలోచించి, విశ్లేషించి, విచక్షణ తో ఓటు వినియోగించాలని సూచించారు. ఏవేవో కొన్ని చిన్న ఆవేశాలకు లోను కావద్దన్నారు. టీఆరెఎస్ రాక ముందు, వచ్చాక పరిస్థితులు బేరీజు వేసుకుని చూడండి. మీ కళ్ళ ముందే అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తున్నాయి. ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒకటి మీకు అంది ఉంటాయి. మీ అనుభవంలోకి వచ్చి ఉంటాయి. ఇంత కంటే ఎవరైనా ఎక్కువ చేశారా? చేయగలరా? ఆలోచించండి. టీఆరెఎస్ అభ్యర్థికి మీ ఓటు వేసి గెలిపించండి… అంటూ పట్టభద్రుల ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.

ఓట్లు రాగానే కొందరు వస్తుంటారు. పోతూ ఉంటారు. ఇక్కడే ఉండి, మన కోసం ఆలోచించే వాళ్ల కు మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల, ఆర్తి ఉంటుంది. అన్నారు. ఓట్ల కోసమే వచ్చే వాళ్లకు ఈ ప్రాంత సమస్యలు తెలువదని, ఇక్కడి వారే కాదని, అలాంటి వారిని ఎన్నుకుంటే మనకు జరిగే ఉపయోగం ఏమీ ఉండదు అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను మంత్రులు ఏకరువు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాకే అన్ని వర్గాల ప్రజలకు గౌరవం పెరిగిందని, ఉద్యోగుల వేతనాలు పెరిగాయని, భద్రత వచ్చిందన్నారు. అర్థం పర్థం లేకుండా విమర్శించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడి సమస్యల గురించి తెలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గడిచిన ఆరున్నర ఏళ్లలో లక్షా 32 వేల 899 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ప్రైవేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమ టాగ్ లైన్ నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు మనవి మనకే దక్కే విధంగా సీఎం కెసిఆర్ చేసి చూపించారని లెక్కలతో సహా వివరించారు.

1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – 30,594 2. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972 3. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623 4. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – హైదరాబాద్ – 179 5. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ – హైదరాబాద్- 80 6. డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ – 66 7. జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ – 9,355 8. డిపార్ట్మెంట్ అఫ్ ఆయుష్ – 171 9. టీఎస్ జెన్ కో- 856 10. టీఎస్ ఎన్పీడీసీఎల్ – 164 11. టిఎస్ ఎస్పిడిసిఎల్ – 201 12. టీఎస్ ట్రాన్స్ కో – 206 13. టిఎస్-ఆర్ టి సి- 4,768 14. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500 15. జెన్కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ – 6,648 16. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ – 22,637 17. హైదరాబాద్ జలమండలి- 807 18. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ – 243 19. డిసిసిబిలు – 1,571 20. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు – 6,258

మొత్తం ఉద్యోగాల సంఖ్య – 1,32,899

ఇలా ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే విప్లవాత్మకమైన టీఎస్ఐపాస్ విధానంతో ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను గత ఆరు సంవత్సరాల్లో తెలంగాణ యువతకు కల్పించాము. ఓ వైపు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన చేపడుతూనే, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం చేపట్టింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.

తాజాగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామనడంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. నిబద్దత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి యువత అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నానని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో టి.ఆర్.ఎస్ నేతలు నూకల శ్రీ రంగారెడ్డి, కొంపల్లి శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

Read more:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం.. బీజేపీ నేతలకు మాట్లాడటానికి ఏం లేదన్న ఎమ్మెల్సీ కవిత

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో