ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం.. బీజేపీ నేతలకు మాట్లాడటానికి ఏం లేదన్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జిల్లాల బాట..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం.. బీజేపీ నేతలకు మాట్లాడటానికి ఏం లేదన్న ఎమ్మెల్సీ కవిత
Follow us
K Sammaiah

|

Updated on: Feb 25, 2021 | 1:35 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జిల్లాల బాట పట్టారు. పట్టభద్రులే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థల చుట్టూ తిరుగుతూ టీచర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక పట్టభద్రులైన నిరుద్యోగు ఓట్లకు గాలం వేసే పనిలో పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఫలితాలతో జోష్‌మీదున్న బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోమారు డీ అంటే డీ అంటున్నారు నేతలు. అభివృద్ధి క్రెడిట్ నీదా? నాదా? అంటూ పోటీపడుతున్నారు.

ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ నేతులు పనిలో పనిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాచారాన్ని కానిచ్చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ నేత కవిత.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు మాట్లాడటానికి ఏం లేకనే.. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని అంటున్నారు.

Read more:

ఆ షాప్‌లకు 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. హామీ నిలబెట్టుకునేందుకు టీ సర్కార్‌ కసరత్తు