Migration of Tribals: అధికారుల వేధింపులు.. పులిభయం.. సేద్యం చేసే ధైర్యం లేక.. వలసపోతున్న గిరిపుత్రులు..

ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పోడు సాగు చేస్తున్న గిరిజనుల బతుకు బితుకుగా మారింది. బతుకు దెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు.

Migration of Tribals: అధికారుల వేధింపులు.. పులిభయం.. సేద్యం చేసే ధైర్యం లేక.. వలసపోతున్న గిరిపుత్రులు..
Migration Of Tribals Podu Cultivation Paddy In Adilabad Forest
Follow us

|

Updated on: Jun 23, 2021 | 1:32 PM

Migration of Tribals in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పోడు సాగు చేస్తున్న గిరిజనుల బతుకు బితుకుగా మారింది. గత కొన్ని రోజులుగా పోడు భూములపై తెలంగాణలో కొద్దిరోజులుగా రచ్చ జరుగుతోంది. అధికారులు వేధిస్తున్నారని.. గిరిజనులు, గిరిజసంఘాల నేతలు ప్రజాప్రతినిధులు కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా పులి భయం కూడా గిరిజనులను వెంటాడుతోంది.

ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు, కాగజ్‌నగర్‌, పెంచికల్ పేట, దహేగాం మండలాల్లోని 14 గ్రామాల రైతులు ఇప్పుడు హైదరాబాద్‌, మంచిర్యాల బాట పడుతున్నారు. బ్రతుకు దెరువు కోసం పొరుగు ప్రాంతాలకు పయనమయ్యారు. 30 ఏళ్ల నుండి పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ, భూముల్లో అడుగు పెట్టవద్దని, సేద్యం చెయ్యొద్దని అధికారుల ఆదేశాలతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. దీనికి తోడు ఇప్పుడు పులి సంచరిస్తోందని, పోడు భూముల్లో కాలు పెట్టొద్దన్న అధికారుల ఆంక్షలతో సాగు ఆగిపోయింది. లోడ్‌పల్లి, కొండపల్లి, దిగిడ లోహాలోని 30 కుటుంబాలు ఇప్పటికే వలస వెళ్లాయి. మరో 30 కుటుంబాలు కూడా ఇవాళో రేపో అన్నట్లు ఉన్నాయి.

పోడు సాగు చెయ్యొద్దని అధికారులు చెప్పినా పెద్దగా పట్టించుకోని రైతులు.. ఇప్పుడు పులి భయంతో మాత్రం వెనక్కి తగ్గారు. అధికారులు పులిని బూచిగా చూపిస్తున్నారో, లేదంటే నిజంగానే క్రూరజంతువు సంచారం ఉందో తెలీదుగానీ.. సేద్యం మాత్రం అసాధ్యంగా మారింది. అన్నం పెట్టే భూములు లేవన్న దిగులు.. ఇప్పుడు రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. 30-40 ఏళ్ల నుండి ఇక్కడే వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇప్పుడు కేసులు, పులులు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. అప్పులు తీర్చే దారి లేక.. బతుకీడ్చే పరిస్థితులు కనిపించక వలస వెళ్లిపోతున్నాం అంటున్నారు రైతులు.

కొందరికి బతుకు భయం, కొందరికి జీవనోపాధి కోసం ఆరాటం. కానీ.. కట్టుకున్న ఇళ్లను, కన్నోన్నళ్లను వదిలేసి ఎక్కడికి వెళ్లాలి.. వెళ్లి ఎప్పుడు తిరిగిరావాలి.. భవిష్యత్‌ ఏంటన్న బెంగ పోడు రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also…. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ఫీజులివే.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కార్..