Kamal Haasan Meets Rajinikanth: తలైవాతో ముగిసిన కమల్‌హాసన్ సమావేశం.. ఆ అంశంపైనే ప్రధాన చర్చ..
తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. కొత్త పొత్తులు పొడుస్తున్న సమయంలో ఇద్దరు సినిమా, రాజకీయ దిగ్గజాల సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్..
Kamal Haasan Meets Rajinikanth: తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. కొత్త పొత్తులు పొడుస్తున్న సమయంలో ఇద్దరు సినిమా, రాజకీయ దిగ్గజాల సమావేశం ప్రధాన్యత సంతరించుకుంది. ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్‌హాసన్ శనివారం.. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నైలోని రజనీ నివాసంలో ఆయనను కలిసినట్లు వెల్లడించారు. అయితే వారి మధ్య అంత సమయం పాటు జరిగిన సమావేశంపై చర్చ మొదలైంది.
ఈ సందర్భంగా ఇరువురూ అరగంటకు పైగా చర్చించుకున్నారు. అయితే.. ఇది మర్యాదపూర్వక సమావేశమని, రాజకీయ పరమైనది కాదని కమల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కమల్, రజనీ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరో వైపు ప్రధాన కార్యదర్శి పదవి, అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారికి 40 సీట్లు కేటాయిస్తే తమ పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తామని, ఇందుకు సహకరించాలంటూ ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం’ నేత టీటీవీ దినకరన్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ రాయబారం నడిపినట్లు తెలిసింది. తమకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు పారిశ్రామికవేత్తల ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వద్దకు, ముఖ్యమంత్రి పళనిస్వామి వద్దకు ఈ సందేశం పంపినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
యూఎస్ లో గ్రీన్ కార్డులు కోరేవారికి శుభవార్త ! త్వరలో రానున్న కొత్త చట్టం, బైడెన్ సంతకమే తరువాయి
Post Office Scheme: పోస్టాఫీసులో రోజూ రూ . 411 జమ చేయడం.. ఆ తర్వాత రూ .43.60 లక్షలు పొందండి..