AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్సులో వంద గ్రాముల నిషిద్ధ కొకైన్, బెంగాల్ లో బీజేపీ యువమోర్చా మహిళా నేత అరెస్టు,

బెంగాల్ లో బీజేపీ యువ మోర్చా మహిళానేతనొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 100 గ్రాముల నిషిధ్ద కొకైన్ ని కలిగి ఉన్న పమేలా గోస్వామి అనే ఈమె తన పర్సులో దీన్ని తీసుకువెళ్తూ...

పర్సులో వంద గ్రాముల నిషిద్ధ కొకైన్, బెంగాల్ లో  బీజేపీ యువమోర్చా మహిళా నేత అరెస్టు,
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 20, 2021 | 4:55 PM

Share

బెంగాల్ లో బీజేపీ యువ మోర్చా మహిళానేతనొకరిని పోలీసులు అరెస్టు చేశారు. 100 గ్రాముల నిషిధ్ద కొకైన్ ని కలిగి ఉన్న పమేలా గోస్వామి అనే ఈమె తన పర్సులో దీన్ని తీసుకువెళ్తూ పోలీసులకు పట్టుబడింది. బెంగాల్లో  కమలం పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి అయిన ఈమె..తన  కారు సీటు కింద ఈ పర్సును దాచిందని పోలీసులు చెప్పారు. ఆమెతో బాటు కారులో ఉన్న ఆమె ఫ్రెండ్, కొలీగ్ ప్రబీర్ కుమార్ డే ని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఓ కేఫ్ కి వెళ్తుండగా ఖాకీలు ఒక్కసారిగా వీరి కారును అడ్డగించి ఆ వాహనాన్ని చెక్ చేశారు.  చూస్తే కారుకింద పర్సు, అందులో ప్యాకెట్లలో ఉన్న కొకైన్ బయటపడ్డాయి. తనను వారు అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా పమేలా…  అన్యాయంగా నన్ను  కేసులో ఇరికిస్తున్నారంటూ కేకలు పెట్టింది.

పమేలా, ప్రబీర్ తరచూ కొన్ని రోజులుగా ఓ కేఫ్ కు అదేపనిగా వెళ్లడం, పార్క్ చేసిన కారులో చాలాసేపు కూర్చుని కొంతమంది యువకులతో మాట్లాడుతూ ఉండడంతో పోలీసులకు వీరిపై అనుమానం కలిగి నిఘా పెట్టారు.  వీరిని కలుసుకునేందుకు పలువురు యువకులు బైక్ లపై వచ్చేవారని తెలిసింది.  2019 లో బీజేపీలో చేరడానికి ముందు పమేలా గోస్వామి ఎయిర్ హోస్టెస్ గా పని చేసిందని, మోడల్ గా కూడా వ్యవహరించిందని, పైగా కొన్ని టీవీ సీరియల్స్ లో సైతం నటించిందని తెలిసింది. ఈమెను బీజేపీ తమ యువ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, హుగ్ల్లీ జిల్లాకు పార్టీ అబ్జర్వర్ గా నియమించింది. ఇంత ముఖ్యమైన పోస్ట్ ఇఛ్చినా… ఈవిడ డ్రగ్స్ వైపు తన ‘పంథా’ మార్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరిన్ని చదవండి ఇక్కడ :

ఉత్తరాఖండ్ ఉత్పాతం, రంగు మారిన అలకానంద నది నీరు, మరికొన్ని రోజుల పాటు సేమ్ సీన్ !

పైసల్లేక కటకట ! వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిధుల కొరత ! ఏం చేద్దాం ?

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్