ఉత్తరాఖండ్ ఉత్పాతం, రంగు మారిన అలకానంద నది నీరు, మరికొన్ని రోజుల పాటు సేమ్ సీన్ !
ఉత్తరాఖండ్ లో ఈ నెల 7 న సంభవించిన ప్రకృతి వైపరీత్యం పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా దేవ్ ప్రయాగ్ వద్ద అలకానంద...
ఉత్తరాఖండ్ లో ఈ నెల 7 న సంభవించిన ప్రకృతి వైపరీత్యం పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా దేవ్ ప్రయాగ్ వద్ద అలకానంద నది నీటి రంగు పూర్తిగా మారిపోయింది. రిషిగంగా, ధౌలి గంగా నదులకు వచ్చిన మెరుపు వరదల కారణంగా ఈ నది నీరు పూర్తి బురదమయంగా మారిపోయింది. సాధారణంగా శీతాకాలంలో స్వచ్ఛంగా ఉండే ఈ నది నీరు ఇలా మారడానికి కారణంవెల్లువెత్తిన బురదేనని ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ అంకుర్ కంసాల్ తెలిపారు. సాధారణంగా వర్షా కాలంలోనే ఇది బురదమయంగా పసుపు పచ్చగా మారుతుందని, కానీ ఇలాంటి పరిస్థితిని తాము ఎన్నడూ చూడలేదని ఆయన చెప్పారు. మొదట జనవరిలో అసాధారణంగా నీలి, ఆకుపచ్ఛరంగుల మిశ్రమంలో ఉండే అలకానంద ఇప్పుడు ఇలా మారడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ నెల 11 న ఈ నది నుంచి శిథిలాలు, బురద 250 కి.మీ. ‘ప్రయాణించి’ గంగా నదిలో కలిశాయని ఆయన వెల్లడించారు. ఈ నెల 6 వరకు కూడా స్వచ్ఛంగా ఉన్న గంగానది నీరు ఇప్పుడు కలుషితమైపోయింది.
రిషిగంగాలో పడిన కొండ శిఖర శిథిలాలు, బురద ఈ నదిలో ఎంతమేరకు పడ్డాయో అంచనా వేయలేమని హిమాలయన్ వాడియా సంస్థ డైరెక్టర్ సైన్ అన్నారు. కాగా మరికొన్ని రోజులవరకు కూడా అలకానంద నది నీరు ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా తపోవన్ టన్నెల్ నుంచి 58 మందికి పైగా మృతదేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read :
పైసల్లేక కటకట ! వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిధుల కొరత ! ఏం చేద్దాం ?
అమెరికాలో భారత సంతతి వ్యక్తికి 41 ఏళ్ల జైలు శిక్ష… తప్పుడు మందులు విక్రయించారని ఆరోపణ..!