AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Crisis: పైసల్లేక కటకట ! వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిధుల కొరత ! ఏం చేద్దాం ?

వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నిధుల్లేక అల్లాడుతోంది. 2014 తరువాత నుంచి తీవ్రమైన సొమ్ముల కొరతను ఎదుర్కొంటోంది. ఈ ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికి దేశ వ్యాప్తంగా గల..

Financial Crisis: పైసల్లేక కటకట ! వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో నిధుల కొరత ! ఏం చేద్దాం ?
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 20, 2021 | 2:23 PM

Share

Financial Crisis: వందేళ్లకు పైగా చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ నిధుల్లేక అల్లాడుతోంది. 2014 తరువాత నుంచి తీవ్రమైన సొమ్ముల కొరతను ఎదుర్కొంటోంది. ఈ ఆర్ధిక సంక్షోభాన్ని అధిగమించడానికి దేశ వ్యాప్తంగా గల  తమ పార్టీ ప్రతినిధుల నుంచి విరాళాలు కోరడానికి, నిధులను సమీకరించడానికి ఎస్ ఓ ఎస్ మెసేజులను పంపాలన్న యోచనలో ఉందంటే దీని పరిస్థితి ఎలా ఉందొ ఊహించవచ్ఛు.. గత నెలలో కొన్ని రాష్ట్రాల పార్టీ శాఖ నేతలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ తదితరులు దీని విషయమే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పేరుకు సంస్థాగత వ్యవహారాలేనంటున్నా మెయిన్ అజెండా ఇదేనని సమాచారం. మహారాష్ట్ర, ఝార్ఖండ్, పంజాబ్ నేతలతో వీరు వేర్వేరుగా భేటీ అయ్యారట. కొందరు మంత్రులు, కొంతమంది సంస్థాగత సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఆ యా రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియను చేపట్టే అంశం కూడా ఈ చర్చల్లో వచ్చింది. పార్టీలో నిధుల కటకట గురించి ఆయా సభ్యులకు వివరించారని, ఆర్ధిక వనరుల సేకరణ బాధ్యత మీదేనని వారిపై నెట్టేశారని సమాచారం.

ఇక కార్పొరేట్లు, ఇతరత్రా నుంచి  విరాళాలు అందుకున్న 5 టాప్ పార్టీల వివరాలు ఇలా ఉన్నాయి.

తాము ఈ మధ్య జరిపిన సమావేశాల్లో నిధుల అంశమే ప్రధానంగా ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీకి భారీగా నిధుల అవసరం ఎంతయినా ఉంది. అప్పుడే ఈ రాష్ట్రాల పార్టీ శాఖలకు ఆర్థికపరంగా తోడ్పడగలుగుతారు.

ఇక టాప్ 5 కార్పొరేట్ డోనర్ల విషయమే తీసుకుంటే..

మూలిగే నక్కపై తాటి పండు పడినట్టు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ నిర్మాణం కూడా ఒకటయింది. కొంతకాలంగా దీని నిర్మాణం కొనసాగుతోంది. దీనికి కూడా డబ్బులు అవసరమే మరి!

బీజేపీతో పోలిస్తే ఈ పార్టీకి నిధుల కొరత అంతాఇంతా కాదు.. కేవలం పంజాబ్, రాజస్థాన్,  చత్తీస్ గఢ్, రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. పుదుచ్చేరి లో ఉన్నా రేపో, మాపో అన్నట్టుగా ఉంది. ఈ నెల 22 న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లో పాలక సంకీర్ణ కూటములతో ఈ పార్టీ నెట్టుకొస్తోంది.

కాగా-2012-13 నుంచి 2018-19 వరకు టోటల్  కార్పొరేట్ డొనేషన్లు ఇలా ఉన్నాయి.

Also Read:

అమెరికాలో భారత సంతతి వ్యక్తికి 41 ఏళ్ల జైలు శిక్ష… తప్పుడు మందులు విక్రయించారని ఆరోపణ..!

Hyderabad: ఆ మెగా ప్రదర్శన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భాగ్యనగర వాసులు.. ఈసారైనా నిర్వహించేనా?