AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ చరిత్రలో తొలిసారిగా మహిళకు ఉరి శిక్ష.. తల్లికి క్షమాభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్న బాలుడు

స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను ఉరి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెను ఉరి తీసేందుకు మథుర జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దేశ చరిత్రలో తొలిసారిగా మహిళకు ఉరి శిక్ష.. తల్లికి క్షమాభిక్ష పెట్టాలంటూ వేడుకుంటున్న బాలుడు
Balaraju Goud
|

Updated on: Feb 20, 2021 | 3:52 PM

Share

Shabnam salim case : స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను ఉరి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెను ఉరి తీసేందుకు మథుర జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరణశిక్ష విధించిన షబ్నం డెత్ వారెంట్ ఎప్పుడైనా రావచ్చు. దీని తరువాత ఆమెను ఉరితీస్తారు. ఇక, ఆ మహిళకు సంబంధించి వివరాలను పరిశీలిస్తే.. 2008 ఏప్రిల్‌లో పరాయి వ్యక్తి మోజులో పడి తన తల్లిదండ్రులు, అమాయక 10 నెలల మేనల్లుడు సహా ఏడుగురు కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపింది షబ్నం.

ప్రియుడితో కలిసి తన కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహిళ షబ్నమ్‌ను ఉరితీసేందుకు జైలు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో షబ్నమ్‌ కుమారుడు తన తల్లి చేసిన నేరాలను క్షమించాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎదుట క్షమాభిక్ష పిటిషన్‌ దాఖలు చేశాడు. రామ్‌పుర్‌ జైలులో తన తల్లిని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్న మహ్మద్‌ తాజ్‌.. భావోద్వేగానికి లోనయ్యాడు. షబ్నమ్‌ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్‌ అనందిబెన్‌ పటేల్‌ క్షమాభిక్షను తిరస్కరించారు. అయితే శుక్రవారం మరోసారి గవర్నర్‌ ముందుకు ఈ పిటిషన్‌ వచ్చింది. ఈ సారి కూడా క్షమాభిక్ష తిరస్కరణకు గురైతే.. ఆమెను ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు సిద్ధంగా ఉన్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్‌ జల్లాదే షబ్నమ్‌నూ ఉరి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, పవన్ జల్లాడ్ ఇంట్లో కూడా జైలు అధికారులు తనిఖీ చేశారు.

షబ్నమ్‌ 2008లో ప్రియుడితో కలిసి కుటుంబ సభ్యులను ఏడుగురిని అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి హతమార్చింది. దీంతో ఇరువురిపై కేసులు నమోదయ్యాయి. అప్పటికే మహ్మద్‌ తాజ్‌ షబ్నమ్ కడుపులో ఉన్నాడు. తరువాత.. షబ్నమ్‌ జైలులోనే తాజ్‌కు జన్మనిచ్చింది. జైలు నిబంధనల ప్రకారం పిల్లవాడికి ఆరేళ్ల వయసు వచ్చిన తరువాత కారాగారం పరిసరాల్లో ఉండకూడదు. దీంతో షబ్నమ్‌… తన మిత్రుడైన ఉస్మాన్‌ సైఫీని తాజ్‌కు సంరక్షకునిగా బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి తాజ్‌కు సంబంధించిన అన్నీ వ్యవహారాలను సైఫీ చూసుకునేవారు.

ఇదిలావుంటే, షబ్నంకు మరణశిక్ష అమలు చేసేందుకు మథుర జైలు అధికారులు రెడీ అయ్యారు. దీంతో తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలంటూ ఆబాలుడు ప్రాధేయపడుతున్నాడు. కాగా, క్షమాభిక్షకు సంబంధించిన పిటిషన్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

Read Also…  అమెరికాలో భారత సంతతి వ్యక్తికి 41 ఏళ్ల జైలు శిక్ష… తప్పుడు మందులు విక్రయించారని ఆరోపణ..!