అమెరికాలో భారత సంతతి వ్యక్తికి 41 ఏళ్ల జైలు శిక్ష… తప్పుడు మందులు విక్రయించారని ఆరోపణ..!

టెక్సాస్‌లో ఓ భారతీయ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌కు మోసపూరితంగా తప్పుడు బ్రాండ్లతో మందులు విక్రయించిన కేసులో 41 నెలల జైలు శిక్ష పడింది.

అమెరికాలో భారత సంతతి వ్యక్తికి 41 ఏళ్ల జైలు శిక్ష... తప్పుడు మందులు విక్రయించారని ఆరోపణ..!
Follow us
Balaraju Goud

| Edited By: Venkata Narayana

Updated on: Feb 20, 2021 | 2:16 PM

Indian origin in US prison : భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించింది అమెరికాకు చెందిన న్యాయస్థానం టెక్సాస్ ఫెడరల్ కోర్టు. టెక్సాస్‌లో ఓ భారతీయ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌కు మోసపూరితంగా తప్పుడు బ్రాండ్లతో మందులు విక్రయించిన కేసులో 41 నెలల జైలు శిక్ష పడింది. సతీష్ పటేల్(37) అనే భారత సంతతి వ్యక్తికి టెక్సాస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ పరేక్ షా.. మిస్‌బ్రాండింగ్ సప్లిమెంట్లు అమ్మినందుకు 41 నెలల శిక్షను విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఎస్‌కే లాబొరేటరీస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న సతీష్ మరికొందరితో కలిసి ఇలా తప్పుడు బ్రాండ్స్‌తో వర్కౌట్, వెయిట్ లాస్ సప్లిమెంట్లను కస్టమర్లకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జాక్3డీ, ఆక్సీఏలైట్ ప్రొ బ్రాండ్స్ పేరిట వీటిని విక్రయించాడు. వీటిని ఉపయోగించిన తర్వాత అనారోగ్య సమస్యలకు గురైన కస్టమర్లు సతీష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్సాస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అటు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ).. ఆక్సీఏలైట్ ప్రొ అనే మందును వినియోగించిన కస్టమర్ల కాలేయం దెబ్బతిన్నట్లు గుర్తించింది. దీంతో సతీష్ విక్రయిస్తున్న జాక్3డీ, ఆక్సీఏలైట్ ప్రొ బ్రాండ్స్‌ను నిషేధించింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన టెక్సాస్ ఫెడరల్ కోర్టు సతీష్‌ పటేల్‌ను దోషిగా తేల్చింది. మోసపూరిత ఔషధాలను విక్రయించిన సతీష్‌కు 41 నెలల జైలు శిక్ష విధించింది.

Read Also…  లక్షలాది భారతీయులకు వరం ? అమెరికాలో గ్రీన్ కార్డుల వెయిటింగ్ కాలాన్ని తగ్గించనున్న బైడెన్ ప్రభుత్వం !