AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్షలాది భారతీయులకు వరం ? అమెరికాలో గ్రీన్ కార్డుల వెయిటింగ్ కాలాన్ని తగ్గించనున్న బైడెన్ ప్రభుత్వం !

లక్షలాది భారతీయులకు వరం కానున్న ఓ బిల్లును అమెరికాలో డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టారు. కాంప్రెహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ బిల్లు పేరిట దీన్ని సెనెటర్ బాబ్ మెనెండెజ్..

లక్షలాది భారతీయులకు వరం ? అమెరికాలో గ్రీన్ కార్డుల వెయిటింగ్ కాలాన్ని తగ్గించనున్న బైడెన్ ప్రభుత్వం !
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 20, 2021 | 1:29 PM

Share

లక్షలాది భారతీయులకు వరం కానున్న ఓ బిల్లును అమెరికాలో డెమొక్రాట్లు సభలో ప్రవేశపెట్టారు. కాంప్రెహెన్సివ్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ బిల్లు పేరిట దీన్ని సెనెటర్ బాబ్ మెనెండెజ్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ మెంబర్ లిండా శాంచెజ్ ప్రతిపాదించారు. గ్రీన్ కార్డులకు సంబంధించి వీటిపై గల వార్షిక కాల పరిమితులను తొలగించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. దీంతో  ముఖ్యంగా ఇండియా నుంచి మరింతమందిని దేశంలోకి అనుమతించవచ్చు. ఇక తమ పేరెంట్స్ ఇమ్మిగ్రేషన్ కు క్వాలిఫై కావడానికి 21 ఏళ్ళ ముందు ఎవరైనా ఇక్కడ  చేరిన పక్షంలో గ్రీన్ కార్డు పొందడానికి వారు అనర్హులనే నిబంధన విషయంలో కూడా ఈ బిల్లు ‘సరళీకృత’ విధానాన్ని అనుసరిస్తోంది.  ఈ అనర్హతను ఇక తొలగించనున్నారు. అంటే ఇలాంటి హెచ్-1బీ వీసా గలవారి పిల్లలకు ఇది అనుకూలంగా ఉంది. వారు హెచ్-1బీ వీసాలతో ఈ దేశంలో కొనసాగవచ్చు.

ప్రస్తుత నిబంధనల ప్రకారమైతే.. తమ తలిదండ్రులు ఇంకా గ్రీన్ కార్డులకోసం వేచి ఉన్న పక్షంలో..అలాంటి వారి పిల్లలకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. కానీ ఈ బిల్లు దాన్ని పూర్తిగా  మార్చివేస్తోంది. ఇక- హెచ్-1 బీ వీసాల గల భార్య లేదా భర్త కూడా అమెరికాలో జాబ్ చేయవచ్చు.  ఇమ్మిగ్రెంట్ల బంధువులు కూడా యూఎస్ లోని తమ కుటుంబాలను కలుసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఇమ్మిగ్రేషన్ పై అధ్యక్షుడు జోబైడెన్ ఇఛ్చిన  ఎన్నికల హామీని నెరవేర్చేందుకు  ఇది పూర్తిగా ఉద్దేశించినది.

చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించిన సుమారు ఎనిమిదిన్నర లక్షలమంది పిల్లలకు ఇక ఇమ్మిగ్రేషన్ హోదా లభించనుంది. వారిని డ్రీమర్స్ గా పేర్కొంటూ ఓ ప్రత్యేక కేటగిరిని ఇందులో చేర్చారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇండియా నుంచి దాదాపు 5 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లకు ప్రయోజనం కలుగుతుంది.

Also Read:

చంద్రబాబులో అంతర్మథనం, కుప్పంలో ఫెయిల్యూర్‌పై ఆగ్రహం.. క్లాస్ పీకుతూనే క్యాడర్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం.!

Puducherry Cm Narayanaswami:’మా ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నాలను ఎదుర్కొంటాం’, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి