మహా ‘ పాలిటిక్స్.. మరొక్క రోజు సస్పెన్స్.. ఫడ్నవీస్ కు అగ్నిపరీక్ష !
మహారాష్ట్ర పాలిటిక్స్ పై సస్పెన్స్ మరొక్క రోజు కొనసాగనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బల పరీక్ష జరగాలని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సాయంత్రం అయిదు గంటల్లోగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఆ తరువాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పు మేరకు బీజేపీ నేత, కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసి. సోమవారం బాధ్యతలు కూడా స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ తన మెజారిటీని బుధవారం […]
మహారాష్ట్ర పాలిటిక్స్ పై సస్పెన్స్ మరొక్క రోజు కొనసాగనుంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బల పరీక్ష జరగాలని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సాయంత్రం అయిదు గంటల్లోగా ప్రమాణ స్వీకారం చేయాలని, ఆ తరువాత ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పు మేరకు బీజేపీ నేత, కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసి. సోమవారం బాధ్యతలు కూడా స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ తన మెజారిటీని బుధవారం సాయంత్రం శాసన సభలో నిరూపించుకోవలసి ఉంటుంది. ‘ 24 గంటల్లోగా ట్రస్ట్ ఓట్ తప్పనిసరి ‘ అని కోర్టు పేర్కొంది. బలపరీక్షను వీడియోగా చిత్రీకరించాలని, ప్రో టెమ్ స్పీకర్ ఈ టెస్ట్ ను నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. అలాగే తాత్కాలిక స్పీకర్ ను గవర్నర్ వెంటనే నియమించాలని కోరింది. ఈ తీర్పుతో ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్నది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం బాలాసాహెబ్ థోరథ్ అనే సభ్యుడే అత్యంత సీనియర్. ఆయన తాత్కాలిక స్పీకర్ గా ఎంపిక కావచ్ఛునని భావిస్తున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ సీకారం చేయడాన్ని సవాలు చేస్తూ శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.