AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో మేము ఎలాంటి సర్వే చేయలేదు

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రముఖ సర్వే సంస్థ ‘లోక్‌నీతి-సీఎస్టీఎస్’ సర్వేలో వెల్లడైనట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు, వార్తా పత్రికలు లోక్‌నీతి-సీఎస్టీఎస్ ఫలితాలు అంటూ కొన్ని వార్తలను ప్రచురించాయి. అయితే ఈ కథనాలపై ఆ సంస్థ స్పందించింది. ఏపీలో తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, ఆ వార్తలన్నీ అబద్ధాలంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో లోక్‌నీతి- సీఎస్టీఎస్ ఓ ప్రకటనను ఇచ్చింది. […]

ఏపీలో మేము ఎలాంటి సర్వే చేయలేదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2019 | 2:09 PM

Share

ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రముఖ సర్వే సంస్థ ‘లోక్‌నీతి-సీఎస్టీఎస్’ సర్వేలో వెల్లడైనట్లు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు, వార్తా పత్రికలు లోక్‌నీతి-సీఎస్టీఎస్ ఫలితాలు అంటూ కొన్ని వార్తలను ప్రచురించాయి. అయితే ఈ కథనాలపై ఆ సంస్థ స్పందించింది. ఏపీలో తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, ఆ వార్తలన్నీ అబద్ధాలంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో లోక్‌నీతి- సీఎస్టీఎస్ ఓ ప్రకటనను ఇచ్చింది.

‘‘ఏపీ ఎన్నికల్లో ఓట్లు, సీట్ల గురించి లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వే చేసినట్లు కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలు, పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మేము స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాం. ఇంతవరకు ఏపీలో మేము ఎలాంటి సర్వేలు చేయలేదు. మా సంస్థ పేరుతో వార్తలను ప్రచురించిన వాటిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా మేము సిద్ధం’’ అంటూ ‘లోక్‌నీతి-సీఎస్టీఎస్’ సంస్థ స్పష్టం చేసింది.

Tweets by LoknitiCSDS