తప్పుడు ప్రచారం చేస్తే తుక్కు రెగొట్టండి… ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గులాబీ‌ శ్రేణులకు నేతల సూచనలు

తెలంగాణలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు..

తప్పుడు ప్రచారం చేస్తే తుక్కు రెగొట్టండి... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గులాబీ‌ శ్రేణులకు నేతల సూచనలు
Follow us

|

Updated on: Feb 27, 2021 | 12:26 PM

తెలంగాణలో ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధానికి తెరతీశాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగిన మంత్రులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తే తుక్కు రెగొట్టండి… తప్పులు ఉంటే సరిదిద్దుకుందాం… ఒక్క ఓటు కూడా రాని నేతలు రోడ్డుపై హడావుడి చేస్తారు… వాళ్లను పిలిచి సరైన సమాధానం చెప్పండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ నేతలు శ్రేణులకు చేస్తున్న సూచనలు. ప్రచారంలో స్పీడు పెంచిన టీఆర్ఎస్‌… ప్రతిపక్షలపై ముప్పేట దాడికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా బీజేపీని ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ విస్తృతంగా పర్యటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున ప్రచారం చేసిన ఆయన… బీజేపీపై హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. ధరలు పెంచి దోసుకోవడం తప్ప… చేసిన ఒక్క మంచి పనేంటో చెప్పాలని ఎర్రబెల్లి సవాల్ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎవరూ ఊరుకోవద్దని… గట్టిగా సమాధానం చెప్పాలని శ్రేణులకు సూచించారు. టీవీ9 బిగ్‌డిబేట్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలు చూడలేక… తాను ఎంటరై సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చానన్నారు.

పరకాలలో జరిగిన సమావేశంలో టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ను అభినందించిన ఎర్రబెల్లి… విమర్శలు చేసే వారికి వెంటనే సమాధానం చెప్పాలన్నారు. కొంతమంది అర్థం లేని విమర్శలు చేస్తుంటే వెంటనే పాల్గొని సమాధానం చెప్పానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అబద్దాల డీఎన్ఏతో ఉన్నాయన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌… బండి సంజయ్‌పై ఘాటైన విమర్శలు చేశారు.

అర్థంపర్థం లేదని విమర్శలు చేస్తున్న వారికి గ్రామ నడిఒడ్డున కూర్చొబెట్టి గట్టిగా సమాధానం చెప్పాలన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉద్యోగ నియామకాలు పక్కా లెక్కలతో ఉన్నాయని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. నిజం గడపదటక ముందే.. అబద్ధం ఊరేగుతుందన్న ఆయన అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఈ ఎన్నికల్లో విద్యావంతులు సరైన బుద్ధిచెప్పాలని కోరారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు:

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ పార్టీ నల్గొండ-ఖమ్మం-వరంగల్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ప్రకటించగా , హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవిని వ్యూహాత్మకంగా బరిలోకి దింపారు. ఇప్పటికే వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గాలు, మండలాల వారీగా సభలు ,సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో అందరికంటే ముందున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల వివరాలు:

హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిగా ఎం రామచందర్ రావు పేరును ప్రకటించింది బిజెపి. అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరింది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు . ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ అభ్యర్థిగా రాములు నాయక్ ను పోటీలో నిలిపింది.

ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న పలువురు ఇప్పటికే ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. టీజేఎస్ నుండి ప్రొఫెసర్ కోదండ రాం, తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ తదితరులు సైతం ఎన్నికల బరిలో నిలిచి పెద్ద ఎత్తున విద్యావంతుల ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more:

తెలంగాణలో హీట్‌ పెంచిన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. గెలుపే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..