వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రాముఖ్యం!

ప్రముఖ నటుడు, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, పార్టీలో ఆమెకు ప్రముఖ స్థానం లభించలేదు…అయితే ఆమె కూడా లోటస్ పాండ్ లేదా ఇతర పార్టీ కార్యాలయాలకు ఎన్నడూ వెళ్ళ‌లేదు. పార్టీ అధ్యక్షుడు జగన్‍తో కొన్ని ర్యాలీలలో ఆమె హాజరైనప్పటికీ…మాట్లాడటానికి మాత్రం అవకాశం రాలేదు. కాగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి యొక్క ప్రాముఖ్యం హఠాత్తుగా పెరుగుతూ వచ్చింది. ఆమె […]

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీ పార్వతి ప్రాముఖ్యం!
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2019 | 12:37 PM

ప్రముఖ నటుడు, ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, పార్టీలో ఆమెకు ప్రముఖ స్థానం లభించలేదు…అయితే ఆమె కూడా లోటస్ పాండ్ లేదా ఇతర పార్టీ కార్యాలయాలకు ఎన్నడూ వెళ్ళ‌లేదు. పార్టీ అధ్యక్షుడు జగన్‍తో కొన్ని ర్యాలీలలో ఆమె హాజరైనప్పటికీ…మాట్లాడటానికి మాత్రం అవకాశం రాలేదు.

కాగా ఇప్పుడు లక్ష్మీ పార్వతి యొక్క ప్రాముఖ్యం హఠాత్తుగా పెరుగుతూ వచ్చింది. ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. మరియు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడే అవకాశం ఆమెకు ఇచ్చారు. ఇటీవలే లక్ష్మీ పార్వతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ళ‌ రామకృష్ణ రెడ్డికి మద్దతుగా మంగళగిరిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఊహించిన విధంగా, ఆమె ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‍ను లక్ష్యంగా పెట్టుకున్నారు.

జగన్ ప్రజల కోసం పార్టీని స్థాపించి ప్రశంసలు అందుకున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. తన మనవడైన లోకేష్‍కి మంగళగిరి అనే పదాన్ని కూడా పలకడం రాదని ఆమె విమర్శించారు. ఈ క్రమంలో “అతను నియోజకవర్గం కోసం మంచి చేస్తాడ‌ని నేను భావించడం లేదు,” అని ఆమె తెలిపారు.

ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తీసిన “లక్ష్మిస్ ఎన్టీఆర్” ఇటీవల విడుదలైన తర్వాత, లక్ష్మీ పార్వతి తిరిగి వెలుగులోకి వచ్చారు మరియు యువ‌తరం ఓటర్లలో పేరుగాంచారు. సహజంగానే లక్ష్మి పార్వతి గురించి తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తిగా ఉంటారు మరియు ఎన్టీఆర్ యొక్క భార్యగా ఆమెను వ్యక్తిగతంగా చూస్తారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపిస్తుంది.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే