టీడీపీలోకి వైసీపీ మాజీ నేత
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలు వలస నాయకులతో నిండిపోతున్నాయి. తాజాగా విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారం టీడీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఇప్పటికే మంత్రి గంటాను కలిసి లైన్ క్లియర్ చేసుకున్న ఆయన నేనడు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కర్రి సీతారాం, ఆ తరువాత […]

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో వలసలు ఊపందుకున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీలు వలస నాయకులతో నిండిపోతున్నాయి. తాజాగా విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారం టీడీపీలో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఇప్పటికే మంత్రి గంటాను కలిసి లైన్ క్లియర్ చేసుకున్న ఆయన నేనడు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కర్రి సీతారాం, ఆ తరువాత పార్టీని వీడి తటస్థంగా ఉంటూ వస్తున్నారు. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కావాలన్న ఉద్దేశంతో టీడీపీ కండువాను కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.