కేరళ ఎన్నికలు, సీఎం పినరయి విజయన్ పై పోటీ చేస్తా, ‘హత్యాచారానికి’ గురైన ఇద్దరు బాలికల తల్లి ప్రకటన
కేరళలోని పలక్కాడ్ జిల్లా... వలయార్ ప్రాంతంలో అత్యాచారానికి, హత్యకు గురైన ఇద్దరు బాలికల తల్లి..తాను సీఎం పినరయి విజయన్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది.
కేరళలోని పలక్కాడ్ జిల్లా… వలయార్ ప్రాంతంలో అత్యాచారానికి, హత్యకు గురైన ఇద్దరు బాలికల తల్లి..తాను సీఎం పినరయి విజయన్ పై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించింది. (2017 లో ఈమె కూతుళ్లిద్దరూ రేప్, హత్యకు గురయ్యారు). కన్నూర్ లోని ధర్మాడం నియోజకవర్గం నుంచి విజయన్ పోటీ చేస్తున్నారు. న్యాయం కోసం ఈ తల్లి చేసే పోరాటానికి మద్దతునివ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఈ అభాగినికి పూర్తి మద్దతునివ్వాలనుకుంటున్నామని, తమ మిత్ర పక్షాలతో కూడా దీనిపై చర్చిస్తామని చెప్పారు. ఈ ఎలెక్షన్స్ లో ముఖ్యమంత్రిపై తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆ బాలికల తల్లి తెలిపారు. నా ఇద్దరు కుమార్తెలను దారుణంగా రేప్ చేసి హత్య చేశారని, తనకు న్యాయం జరగాలని ఆమె అంటున్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలని కోరిన ఈమె.. సంఘ్ పరివార్ మద్దతును మాత్రం కోరబోనని చెప్పారు.
2017 జనవరి 13 న… తన 11 ఏళ్ళ అక్క మృతదేహాన్ని ఆమె తొమ్మిదేళ్ల చెల్లెలు వలయార్ లోని తమ ఇంట్లో కనుగొంది.అదే సంవత్సరం మార్చి 4 న ఈ పాప కూడా దాదాపు ఇదే పరిస్థితుల్లో విగతజీవిగా కనిపించింది. ఈ కేసులో రేప్, సూసైడ్ కి ప్రేరేపించారన్న ఆరోపణపై అయిదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే 2019 అక్టోబరులో…. ఈ కేసులో నిందితులు దారుణానికి పాల్పడ్డారనడానికి సాక్ష్యాధారాలు లేవంటూ పలక్కాడ్ జిల్లా కోర్టు వారిని వదిలివేసింది. కానీ ఆ ఉత్తర్వులను కేరళ హైకోర్టు ఈ ఏడాది జనవరిలో కొట్టివేసింది. ఈ కేసు నాడు వలయార్ లో పెను సంచలనమైంది. ఇలా ఉండగా.. సీఎం పినరయి విజయన్ నిన్న ధర్మాడం నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు . కాగా-స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఓటర్లు మద్దతునిచ్చి గెలిపించగలరన్న విశ్వాసాన్ని ఆ తల్లి వ్యక్తం చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Food of The Future : అక్కడ స్టార్ హోటల్స్ లో ‘పురుగులు’ ప్రత్యేక ఫుడ్ వింగ్స్ ..పెరుగుతున్న జనాభాకు ఇవి తినడం తప్పదట
కొమ్మలు నరికేసారని చెట్టు ఏడుస్తోంది.. వింతగా చూస్తున్న జనాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..