కొమ్మలు నరికేసారని చెట్టు ఏడుస్తోంది.. వింతగా చూస్తున్న జనాలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..

Tree Crying Video Goes Vairal : మహారాష్ట్ర లోని సోలాపూర్ బలివ్స్ ప్రాంతంలో ఓ స్కూల్ ఎదురుగా వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఏడుస్తోంది.

కొమ్మలు నరికేసారని చెట్టు ఏడుస్తోంది.. వింతగా చూస్తున్న జనాలు.. నెట్టింట్లో  వైరల్ అవుతున్న వీడియో..
Tree Crying Video Goes Vair
Follow us
uppula Raju

|

Updated on: Mar 16, 2021 | 6:09 PM

Tree Crying Video Goes Vairal : మహారాష్ట్ర లోని సోలాపూర్ బలివ్స్ ప్రాంతంలో ఓ స్కూల్ ఎదురుగా వందల ఏళ్లుగా ఉన్న చెట్టు ఒక్కసారిగా ఏడుస్తోంది. ఆ చెట్టు నుంచి వింతగా నీటి ధారలు కారుతున్నాయి. అయితే చెట్టు ఏంటి ఏడవడం ఏంటని అనుకుంటున్నారా.. అవునండి ఇది నిజం. మామూలుగా అయితే మనుషులు, జంతువులు ఏడవడం చూసి ఉంటారు.. కానీ చెట్టు ఏడవడం ఇదే మొదటిసారి.. దీంతో చుట్టుపక్కల జనాలు తండోపతండాలుగా వచ్చి ఈ వింతను చూస్తున్నారు. అయితే చెట్టు ఏడవడానికి గల కారణాలను స్థానికులు ఈ విధంగా చెబుతున్నారు.

అది వందల ఏళ్ల నాటి చెట్టు.. అయితే కొమ్మలు భారీగా పెరిగిపోవడంతో స్థానికులు ఇటీవల నరికివేశారు. అప్పటి నుంచి విచిత్రంగా చెట్టునుండి ధారాపాతంగా నీరు కారడం ప్రారంభమయ్యింది. చెట్టులోపల ఏమైనా నీరు నిలిచి ఉండొచ్చు అందుకే నీరు వస్తోందని అందరు ఈజీగా తీసుకున్నారు. కానీ నీరు కారడం రోజు రోజుకు పెరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. చెట్టు కొమ్మలు నరికివేయడంతో చెట్టు ఏడుస్తుందని అక్కడివారు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ వింతను చూడటానికి జనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పడది వైరల్‌గా మారిపోయింది.

అయితే అసలు చెట్టు నుంచి నీరు కారడానికి కారణం ఏంటని బయాలజీ ప్రొఫెసర్లు ఆరా తీస్తే అది చెట్టుకు ఉన్న ఒక లక్షణమని , చెట్టు కొమ్మలు నరికివేయడంతో కింద నుంచి చెట్టు పీల్చుకుంటున్న నీరు అలా బయటికి వస్తుందని తెలిపారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జనాలు మాత్రం వింతగా చూస్తున్నారు.

రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 17 న ఓటింగ్, మే 2న ఓట్ల లెక్కింపు

నెల్లూరు నుంచి నరసాపురం వెళ్లోన్న స్విఫ్ట్ కారు, డిక్కీ చెక్ చేసిన పోలీసులు.. అయ్యబాబోయ్‌.. డబ్బే డబ్బు.!