తెదేపాలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. కాకినాడలో బూత్ కన్వీనర్లతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హర్షకుమార్‌తో పాటు ఆయన కుమారుడ్ని సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపాలో చేరడం తాను గొప్పగా భావిస్తున్నానని.. చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని కాపాడారని హర్షకుమార్ తెలిపారు. అమలాపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా హర్షకుమార్‌ను ఆ పార్టీ బరిలోకి దించే సూచనలు కన్పిస్తున్నాయి. మరో వైపు ఈ సీటు కోసం దివంగత లోక్‌సభ […]
అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సీఎం చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. కాకినాడలో బూత్ కన్వీనర్లతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హర్షకుమార్‌తో పాటు ఆయన కుమారుడ్ని సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపాలో చేరడం తాను గొప్పగా భావిస్తున్నానని.. చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని కాపాడారని హర్షకుమార్ తెలిపారు. అమలాపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా హర్షకుమార్‌ను ఆ పార్టీ బరిలోకి దించే సూచనలు కన్పిస్తున్నాయి. మరో వైపు ఈ సీటు కోసం దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి తనయుడు హరీశ్ కూడా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి సీటు లభిస్తుందనే విషయం త్వరలో తేలనుంది.