హరీష్‌కు మంత్రి పదవి.. ఇక కలేనా..!

హరీష్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న వ్యక్తి. అసలు తెలంగాణలో ఆయన పేరు తెలియని వారుండరు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయఢంకా మోగిస్తూ వస్తున్న ఆయన.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలి కేబినెట్‌లో బెర్తు ఖరారు కాలేదు. హరీష్ రావుకు సీఎం కేసీఆర్ మొండిచేయి చూపెట్టారు. దీంతో ఆయన అభిమానులే కాదు.. ఇతర పార్టీ నేతలు […]

హరీష్‌కు మంత్రి పదవి.. ఇక కలేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 24, 2019 | 2:11 PM

హరీష్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న వ్యక్తి. అసలు తెలంగాణలో ఆయన పేరు తెలియని వారుండరు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయఢంకా మోగిస్తూ వస్తున్న ఆయన.. రాష్ట్రం ఏర్పడ్డాక తొలి కేబినెట్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా వ్యవహరించారు. అయితే రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలి కేబినెట్‌లో బెర్తు ఖరారు కాలేదు. హరీష్ రావుకు సీఎం కేసీఆర్ మొండిచేయి చూపెట్టారు. దీంతో ఆయన అభిమానులే కాదు.. ఇతర పార్టీ నేతలు కూడా షాక్ తిన్నారు. అయితే కీలక పదవి ఏదైనా కట్టబెడతారేమో అనుకున్నారు అంతా. అయితే ఆ వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్‌కు కేటాయించడం.. హరీష్ రావును వెనక్కి నెట్టినట్టయ్యింది. అయితే మరోసారి కేబినెట్ విస్తరణలోనైనా హరీష్‌ పేరు వస్తుందనుకున్నారు. కానీ మంత్రి పదవిపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గెలుపు బాధ్యతలను హరీష్ తన భుజస్కంధాలపై వేసుకుని విజయం సాధించారు. అయితే ఇక్కడి వరకు అంతా సాఫీగా సాగినా.. పలుమార్లు హరీష్ రావు పార్టీ మారుతున్నారంటూ పుకార్లు వినిపించాయి. పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యతను తగ్గిస్తున్నారంటూ వెలువడిన వార్తలను ఆయన బహిరంగంగానే ఖండించారు. అయితే తాజాగా జరిగిన ఘటన చూస్తే.. హరీష్ రావుకు మంత్రి పదవి రావడం అనేది సస్పెన్స్‌గా మారింది.

మొన్న కేసీఆర్ చింతమడక పర్యటనతో హరీష్‌కు మంత్రి ప‌ద‌విపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స‌మావేశంలో హ‌రిష్ రావు కంటే.. జిల్లా క‌లక్ట‌ర్‌ను ఎక్కువ‌గా మెచ్చుకున్నారు కేసిఆర్. సిద్దిపేట తన సొంత అడ్డా అంటూ వ్యాఖ్యానించారు కేసీఆర్. నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌తి గ్రామ పంచాయితికి రూ. 25 ల‌క్ష‌లు అడిగితే రూ. 50 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. అడిగిన వాటి కంటే ఎక్కువ ప్రకటనలు చేయడంతో.. ఆయన వర్గంలో ఆందోళనలు మొదలయ్యాయి. సిద్దిపేట మున్సిపాలిటికి కూడా మ‌రింత అధికంగా నిధులు ఇవ్వడం చూసిన స్థానికుల్లో ఆయనకు మంత్రి ప‌ద‌వి ఇక దక్కదన్న గుసగుసలు మొదలయ్యాయి. అంతేకాదు ఇక సిద్ధిపేటను కేసిఆర్ స్వ‌యంగా చుసుకుంటార‌న్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి ప‌దవి నుంచి హరీష్‌ను ప‌క్క‌న పెట్టడానికే.. కేసీఆర్ ఈ ఆకస్మిక పర్యటన చేపట్టినట్లు ప్రచారం నడుస్తోంది.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..